కూతురు కోసం పెద్ద సాహసానికి ఒడిగట్టిన సింగర్ సునీత.. నిజంగా గ్రేట్?

తెలుగు చిత్ర పరిశ్రమలో సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సునీత తన వ్యక్తిగత విషయంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొందని చెప్పాలి.ఇలా జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలని చూసిన ఈమె ప్రస్తుతం రెండవ వివాహం చేసుకొని ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇలా రెండవ వివాహంలో సంతోషంగా ఉన్న సునీత తన పిల్లల కోసం అహర్నిశలు కష్టపడుతున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే సునీత తన కొడుకును హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా తన కూతురు శ్రేయ ఇది వరికే సింగర్ గా పలు సినిమాలలో పాటలు పాడారు. అయితే తన తల్లిలా ఈమె కూడా ఇండస్ట్రీలో సింగర్ గా స్థిరపడుతుందని అందరూ భావిస్తున్నప్పటికీ, సునీత కూతురి కోరికలు మాత్రం వేరే ఉన్నాయని తెలుస్తుంది. ఈమెకు నాసాలో సైంటిస్ట్ గా పని చేయాలని కోరిక బలంగా ఉండటం ఎలాగైనా నాసాలో సైంటిస్ట్ గా స్థిరపడాలని శ్రేయ భావిస్తున్నట్టు తెలుస్తుంది.

ఈ విధంగా తన కుమార్తె కోరికను తీర్చడం కోసం సునీత ఎంత డబ్బు ఖర్చు చేసి అయినా తన కూతురిని సైంటిస్టును చేయాలని భావిస్తున్నారు. ఇలా తన కూతురి కోరికను తీర్చడం కోసం సునీత పెద్ద సాహసం చేస్తున్నారని తెలుస్తోంది. ఇకపోతే ఈ విషయం సోషల్ మీడియాలో తెలియడంతో ఎంతోమంది అభిమానులు సునీత ప్రయత్నంపై ప్రశంసల కురిపిస్తున్నారు.