సిద్దూ జొన్నలగడ్డ ట్రయంగిల్‌ లవ్‌స్టోరీ!

డీజే టిల్లుతో ఓవర్‌న్కెట్‌ పాపులారిటీ తెచ్చుకున్న సిద్దూ.. ఆ క్రేజ్‌ను కాపాడుకునేందుకు తెగ ఆరాటపడుతున్నాడు. సిద్దూకు ఈ సినిమా తెచ్చి పెట్టిన క్రేజ్‌ అంతా ఇంతా కాదు. అప్పటివరకు తనవైపు చూడని మేకర్స్‌ కూడా తలుపు తట్టి మరీ అవకాశాలు ఇస్తున్నారు. అయితే సిద్దూ మాత్రం ఆఫర్లు వస్తున్నాయి కదా అని ఏది పడితే అది చేయకుండా.. కాస్త ఎక్కువ ట్కెమ్‌ తీసుకున్నా సరే ఆడియెన్స్‌కు బెస్ట్‌ ఎంటర్‌ట్కెనమెంట్‌ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు.

ప్రస్తుతం సిద్దూ టిల్లూ స్క్వేర్‌తో బిజీగా గడుపుతున్నాడు. ఇక ఇటీవలే సిద్దూ తన కొత్త సినిమాను ప్రకటించాడు. తెలుసు కదా అనే ట్కెటిల్‌తో ప్రముఖ డిజ్కెనర్‌ నీరజ కోన డెబ్యూ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు వెల్లడిరచాడు. ఈ మేరకు ఓ స్పెషల్‌ గ్లింప్స్‌ను కూడా రిలీజ్‌ చేశాడు. కాగా తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.

నేచురల్‌ స్టార్‌ నాని ముఖ్య అతిథిగా వచ్చి సినిమాను లాంఛ్‌ చేశాడు. ఈ వేడుకకు నితిన్‌, ఆది, దర్శకులు హరీష్‌ రెడ్డి, బాబీ, నందినీ రెడ్డిలతో పాటు ఈ సినిమా హీరోయిన్‌లు రాశీఖన్నా, శ్రీనిధి శెట్టిలు వచ్చారు. ప్రస్తుతం ఈ లాంఛింగ్‌ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ విరీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

ఇక ఈ సినిమా ఓ ట్రయంగిల్‌ లవ్‌స్టోరీ అని.. థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుడు ఏమేమి కోరుకుంటాడో అవి పుష్కలంగా ఉండబోతున్నట్లు మేకర్స్‌ చెప్పారు. ఎమోషన్‌, ఎంటర్‌ట్కెనమెంట్‌, హాస్యం ఇలా అన్ని కలిసిన విందు భోజనంలా సినిమా ఉండబోతుందట. పీపుల్‌ విరీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు మ్యూజిక్‌ సెన్సేషన్‌ థమన్‌ స్వరాలు అందిస్తున్నాడు.