టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తెలుగులో నటించిన బొమ్మరిల్లు, బాయ్స్,నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సినిమాల ద్వారా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఈయన తెలుగు సినిమాలకు దూరమయ్యారు. ఇకపోతే సిద్ధార్థ నటి అతిధి రావు హైదరితో రిలేషన్ లో ఉన్నారని గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.అయితే ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ కూడా పలు రెస్టారెంట్లలో కలిసి సందడి చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.
ఇకపోతే వీరిద్దరూ కలిసి మహాసముద్రం సినిమాలో కూడా నటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై శర్వానంద్ కూడా ఓపెన్ అవుతూ ఏమో వారిద్దరూ రిలేషన్ లో ఉండొచ్చు అన్నట్టు ఈయన కూడా సమాధానం చెప్పారు. ఇకపోతే తాజాగా ముంబైలో ఓ రెస్టారెంట్లో ఇద్దరు మీడియా కంటపడటంతో ఈ వార్తలు మరింత వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా ఇలా మీడియా కంటపడగా మీడియా మీరిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారా అంటూ ప్రశ్నించగా ఈ జంట మీడియాపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక తాజాగా ముంబై రెస్టారెంట్లో వీరిద్దరూ మరోసారి మీడియా కంటపడటమే కాకుండా ఒకరి చేతిని మరొకరు పట్టుకొని చట్టపట్టలేసుకొని తిరగడంతో వీరిద్దరూ కన్ఫామ్ గా రిలేషన్షిప్ లో ఉన్నారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఇలా త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.