సిద్దార్థ్, అదితి రావు హైదరి మధ్య కుచ్ కుచ్ హోతా హై అని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. వీరిద్దరూ కలిసి అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహా సముద్రం’ చిత్రంలో నటించారు. అప్పుడే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని ప్రచారం నడుస్తోంది. ఓ సందర్భంలో అలాంటిది ఏమీ లేదంటూ సెలవిచ్చారు.
కానీ తరచూ పార్టీలకు, షికార్లకు వెళ్తూనే కనిపించారు. హిట్ పాటలకు రీల్స్ కూడా చేశారు. ఇద్దరూ కలిసి ఎన్నోసార్లు కెమెరాకు చిక్కారు. తాజాగా మరోసారి ఈ జంట వార్తల్లో నిలిచారు. తాజాగా అదితీరావు హైదరీ సిద్దార్థ్‌తో ఉన్న ఫొటోను షేర్ చేసి ‘హ్యాపీ బ్లెస్డ్ గ్రేట్‌ఫుల్’ అని పోస్ట్ చేసింది. ‘మ్యాజిక్ చేయాలంటే.. ఆనందం, ప్రేమ, నవ్వులు, ఇంద్రదనస్సు..ఉండాలి.
ఇవన్నీ నీతోనే సాధ్యం అనే అర్థం వచ్చేలా ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు ఇద్దరి మధ్య ఉన్న లవ్‌స్టోరీని అఫీషియల్‌గా చెప్పారనే ఊహల్లో ఉన్నారు. ఇంతకీ సిద్దార్థ్, అదితీల మధ్యనున్న ప్రేమకు ఇది అఫీషియల్ అనౌన్స్ మెంట్ అనుకోవచ్చా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో సిద్దార్థ్‌తో డేటింగ్‌పై ప్రశ్న ఎదురైంది.
దీనిపై ఆమె స్పందిస్తూ అలాంటిది ఏమన్నా ఉంటే నేనే చెప్తానంటూ మాట దాటవేసింది. అయినా నేనేం చెప్పినా చివరకు మీకు నచ్చినట్లుగానే ఊహించుకుంటారుగా అని కౌంటర్ కూడా వేసింది. బొమ్మరిల్లు హీరోగా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రవేసుకున్న సిద్దార్థ్ 2023లో చిన్నా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. సమ్మోహనం, మహాసముద్రం, వీ సినిమాలతో అందరికీ హాయ్ చెప్పింది అదితీరావ్ హైదరి.
ఈ హైదరాబాదీ ముద్దుగుమ్మ సిద్దార్థ్‌తో కలిసి చక్కర్లు కొడుతూ.. నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన బాయ్ ఫ్రెండ్ సిద్దార్థ్‌తో కలిసి న్యూ ఇయర్ వెకేషన్ ట్రిప్ వేసింది. ఇంతకీ ఈ ఇద్దరు ఎక్కడికెళ్లారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ లో ఉండగా.. ఈ ఫొటోలు మాత్రం నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
మొత్తానికి ఈ క్రేజీ యాక్టర్లు 2024 సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా తమ రిలేషన్‌షిప్‌ను ఇలా అధికారికంగా ఫైనల్ చేశారంటూ ఇప్పుడు నెట్టింట తెగ చర్చించుకుంటున్నారు మూవీ లవర్స్!