RaviTeja : మెలోడీతో ఆకట్టుకున్న మాస్ రాజా…మరోసారి మాయచేసిన సిద్ శ్రీరామ్…!

Ravi Teja : ఏడాదికి రెండూ సినిమాలు అన్న లెక్కతో వరుస సినిమాలు చేస్తున్నాడు మాస్ రాజా రవితేజ. ఓ వైపు రామారావు ఆన్ డ్యూటీ అంటూ మరోపక్క రావణాసుర గా తయారవుతున్నాడు. ఇక మెగాస్టార్ తో మల్టీ స్టార్రర్ అంటున్నాడు. ఇక ఇంకోవైపు బాలయ్యతో వస్తా అంటున్నాడు.ఇలా వరుస సినిమాలతో అభిమానులను ఊపిరి తీసుకోనికుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు మాస్ రాజా.

ఇక రామారావు ఆన్ డ్యూటీ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అంచనాలు పెంచేసింది. ఇక లేటెస్ట్ గా ఒక మెలోడీ సాంగ్ ను విడుదల చేసారు సినిమా యూనిట్. తూలే గిరగిర మని బుర్రె ఇట్టా.. తేలిందా నెలవంత అడుగుల వెంట’ అంటూ సాగే ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది. సిద్ శ్రీరామ్ తన వాయిస్‌తో మళ్ళీ ఫిదా చేశాడు. ఇక హీరోయిన్ తో రవితేజ డాన్స్ ఆకట్టుకుంది. పాటలో కొత్తదనం సంగీత ప్రేక్షకులను ఆకట్టుకుంది.

YouTube video player

రాకెందు మౌళి సాహిత్యం ఆకట్టుకునేలా కొత్త పదాలు ‘బుల్ బుల్ త్రాంగ్’ అంటూ అద్భుతంగా ఉంది. సామ్ సీఎస్ సంగీతం సరళంగా గాల్లో తేలిపోతున్నట్లుగా ఉంది. ప్రస్తుతం ఈ లిరికల్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ రెవెన్యూ డివిజన్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. రవితేజకు జోడిగా దివ్యాంశ కౌషిక్, రాజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. చాలా కాలం తర్వాత సీనియర్ హీరో వేణు తోట్టెంపూడి ఈ చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. శ్రీ లక్ష్మివెంకటేశ్వరా సినిమాస్, ఆర్‌టి టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరితో కలిసి రవితేజ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జూన్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇక రవితేజ ఖాతాలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి.