‘శ్యామ్‌ సింగరాయ్’ స్టోరీ లీక్.. వద్దంటుంటే ప్రయోగాల జోలికి వెళుతున్న నాని.. ?

రీసెంట్ గా నాని నటిచిన వి సినిమా ఓటీటీలో వచ్చి ప్రేక్షకులని డిసప్పాయింట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదేం పట్టించుకోకుండా తన సినిమాలని తను చేసుకుంటూ వెళుతున్నాడు. నిన్నుకోరీ, మజిలీ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నాని టక్ జగదీష్ అన్న సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో నాని కి జంటగా రీతువర్మ, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు.

Nani's next is 'Tuck Jagadish', directed by Shiva Nirvana - The Hindu

ఇక దసరా పండుగ సందర్భంగా ‘టాక్సీవాలా’ ఫేమ్‌ రాహుల్‌ సంకృత్యన్‌ దర్శకత్వంలో నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ ‘శ్యామ్‌ సింగరాయ్’‌ డిసెంబర్ నుంచి మొదలవనుందని ప్రకటించారు. ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్ గా ఫైనల్ కాగా నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్నాడు. మికీ జె.మేయర్ సంగీతమందిస్తున్నాడు. అయితే ఈ సినిమా కథ లీకయినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Shyam Singh Rao Concept poster: Nani is seen as a shadow image - tollywood

రాహుల్‌ సంకృత్యన్ పునర్జన్మల నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించనున్నట్టు.. నాని త్రిపాత్రాభినయం చేస్తున్నట్టు తెలుస్తుంది. ‘టాక్సీవాలా’ సినిమాని కూడా సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఆసక్తికరంగా నడిపి సూపర్ హిట్ అందుకున్న రాహుల్‌ సంకృత్యన్ ‘శ్యామ్‌ సింగరాయ్’ లో నాని ని మూడు విభిన్నమైన పాత్రల్లో చూపించబోతున్నట్టు చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఈ మూడు పాత్రలలో నాని పర్ఫార్మెన్స్ చూసిన ఫ్యాన్స్ థ్రిల్లవుతారని అంటున్నారు.

ఇంతక ముందు జెంటిల్ మాన్, కృష్ణార్జున యుద్దం సినిమాలలో డ్యూయల్ రోల్ లో నటించిన నాని తన నేచురల్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టున్నాడు. మొదటి సారి త్రిపాత్రాభినయం చేయబోతున్న నాని ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి. ఇక మరో హీరోయిన్ గా అదితీ రావు ని ఫైనల్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన అఫీషియల్ న్యూస్ త్వరలో రానుందని సమాచారం. నాని కి ఈ మధ్య ప్రయోగాలు అంతగా కలిసి రావడం లేదు. అయినా ‘శ్యామ్‌ సింగరాయ్’‌ తో మళ్ళీ ప్రయోగమే చేస్తున్నాడు… చూడాలి మరి ఏం జరుగుతుందో.