పుష్ప ని ఇమిటేట్ చేస్తున్న శ్రియ కూతురు.. వైరల్ అవుతున్న క్యూట్ వీడియో!

ప్రస్తుతం దేశం మొత్తం పుష్ప గాడి ఫీవర్‌లోనే ఉందన్న సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద పుష్ప రాజ్ క్రియేట్ చేస్తున్న కొత్త రికార్డుల పరంపర ఇంకా ఆగడం లేదు. ఇప్పటికే ఈ మూవీ రూ. 1799 కోట్ల కలెక్షన్లు సాధించినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇక నేడో, రేపు బాహుబలి 2 (1810 కోట్లు) కలెక్షన్లను కూడా అధిగమించనుంది. ఇప్పుడున్న టైంలో ఒక వారం, రెండు వారాలు ఆడటమే గొప్ప.

కానీ పుష్ప 2 మాత్రం ఇంకా నార్త్‌లో దుమ్ములేపేస్తోంది. ఈ సినిమాలో బన్నీ క్యారెక్టర్ పుష్ప రాజ్ కి ఉన్న మేనరిజం అందరికీ బాగా కనెక్ట్ అయింది. ఈ మేనేజర్ ఇప్పటికే చాలామంది చాలా రీల్స్ చేసే స్పెషల్ మీడియాలో షేర్ చేశారు అయితే సామాన్యులకే కాదు ప్రముఖులకి సైతం పుష్పరాజ్ క్యారెక్టర్ తెగ నచ్చేసింది. దాంతో కామన్ మేన్ నుంచి సెలెబ్రిటీల వరకు పుష్ప రాజ్‌ను ఇమిటేట్ చేస్తున్నారు.

అలా తన కూతురు కూడా పుష్ప రాజ్‌లా మారిపోయిందని శ్రియా చెబుతోంది. ఇంకా ఆమె పుష్ప 2 సినిమా చూడలేదని, కానీ ఇలా జుకేగా నహీ సాలా అంటూ చేసేస్తోందని శ్రియా ఓ క్యూట్ వీడియోని షేర్ చేసింది. ప్రస్తుతం శ్రియా కూతురు రాధ క్యూట్ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. శ్రీయ గతంలో కూడా తన కూతురు వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసింది.

అదేమిటంటే ఆమె కూతురు రాదని పొలంలోకి తీసుకువెళ్లి పంటలు ఎలా నూర్పాలి అనే విషయాన్ని తానే స్వయంగా చేసే చూపించింది. అప్పుడు కూడా ఆ వీడియో తెగ వైరల్ అయింది. ఒక స్టేటస్ పెడితే పిల్లలని సినిమాలకి షాపింగ్ మాల్స్ కి గేమ్స్ కి తీసుకువెళ్తారు కానీ శ్రీ ఏ మాత్రం తన కూతురిని పొలానికి తీసుకెళ్లడం గ్రేట్ అంటూ తెగ ప్రశంసలు కురిపించారు నెటిజన్స్.