స్పెషల్‌ సాంగ్‌లో శ్రియా శరణ్‌!

కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య ప్రస్తుతం బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఈ స్టార్‌ కాంపౌండ్‌ నుంచి ఇప్పటికే కంగువ విడుదలకు ముస్తాబుతోంది. ఈ సినిమా విడుదల కాకముందే సూర్య 44 కు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు సూర్య. స్టార్‌ డైరెక్టర్‌ కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ భామ పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.

తొలి షెడ్యూల్‌లో భాగంగా అండమాన్‌ లోని పోర్ట్‌ లబెయిర్‌లో యాక్షన్‌ సీక్వెన్స్‌తోపాటు సూర్య, పూజాహెగ్డేపై వచ్చే సాంగ్స్‌ను చిత్రీకరించి నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి.

తాజాగా మరో ఆసక్తికర వార్త నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది. ఈ మూవీలో సీనియర్‌ హీరోయిన్‌ శ్రియా శరణ్‌ స్పెషల్‌ సాంగ్‌లో మెరువనుంది. ఊటీ షెడ్యూల్‌లో ఈ పాటను చిత్రీకరించనున్నారట మేకర్స్‌. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ ఇడుక్కి పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో పాపులర్‌ మలయాళ నటుడు జోజు జార్జ్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఈ మూవీకి సంతోష్‌ నారాయణన్‌ మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ అందిస్తున్నాడు. పీరియాడిక్‌ వార్‌ అండ్‌ లవ్‌ నేపథ్యంలో వస్తోన్న సూర్య 44కు తిరు, 24, పేటా ఫేం సినిమాటోగ్రఫర్‌ డీవోపీగా పనిచేస్తున్నాడు. సూర్య హోంబ్యానర్‌ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పై తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని మేకర్స్‌ 2025 పొంగళ్‌ కానుకగా రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్‌.