సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరో అర్జున్ సర్జా కు ప్రత్యేక స్థానం ఉంది. ఈయన విభిన్న యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతంగా నటించి యాక్షన్ కింగ్ గా ప్రేక్షకుల మదిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అర్జున్ కన్నడ సినీ ఇండస్ట్రీ చెందిన హీరో అయినప్పటికీ తెలుగు తమిళ భాషల్లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి సౌత్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. అర్జున్ వ్యక్తిగతంగా కూడా ఎంతో మంచి వ్యక్తి ఎవరిని విమర్శించడం ఎవరితోనూ వివాదాలు పెట్టుకోవడం అసలు నచ్చదని సినీ ప్రముఖులు చెబుతుంటారు.
అర్జున్ మా పల్లె గోపాలుడు సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని మన్యంలో మొనగాడు, జెంటిల్ మ్యాన్, కోనసీమ మొనగాడు, శ్రీ మంజునాథ, పుట్టింటికి రా చెల్లి, హనుమాన్ జంక్షన్, ఒకే ఒక్కడు వంటి బ్లాక్ బస్టర్ మూవీల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించాడు. సౌత్ ఇండియాలో అన్ని భాషల్లో కలిపి దాదాపు 130 సినిమాలు పైగా నటించారు.అర్జున్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 9 కోట్ల రెమ్యునేషన్ తీసుకుంటున్నారు. ఇతని దగ్గర ఏడు కోట్ల విలువ గల ఐదు లగ్జరీ కార్లు ఉన్నాయి. 20 కోట్ల విలువ చేసే ఇల్లు మరియు ఇతని భార్యాపిల్లల పేర్ల మీద ఉన్న మొత్తం ఆస్తి విలువ కలిపితే దాదాపు 400 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా
అర్జున్ కుటుంబ విషయానికొస్తే అర్జున్ తండ్రి కూడా నటుడే అయినప్పటికీ అర్జున్ ఎప్పుడు సినిమాల్లో నటించాలనుకోలేదు. అర్జున్ పోలీస్ అవ్వాలని కోరిక ఉన్నప్పటికీ తన అన్న కిషోర్ దర్శకుడు కావడంవల్ల అనుకోకుండా సినిమాలో నటించి మంచి పేరు రావడంతో సినిమాల్లోని కొనసాగాల్సి వచ్చింది. అర్జున్ నివేదితను వివాహం చేసుకున్నాడు. ఈమె కూడా ప్రముఖ హీరోయిన్ కావడం విశేషం.వీరికి ఇద్దరు పిల్లలు, ఐష్వర్య సర్జా, అంజనా సర్జా. అర్జున్ పెద్ద కూతురు ఐశ్వర్య కూడా ప్రస్తుతం సినిమాల్లో హీరోయిన్గా నటిస్తోంది. అర్జున్ హనుమాన్ భక్తుడు కావడంతో 30 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహంతో కూడిన గుడిని కట్టిస్తున్నాడు.