టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ యశోద. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న సినిమానును శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణ సారధ్యంలో హరి ,హరీష్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. సంగీత దర్శకుడు మణిశర్మ అద్భుతమైన బానిలతోపాటు ప్రముఖ నటులు
వరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్నీ ముకుందన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే యశోద సినిమాకు సంబంధించిన ట్రైలర్ ,పోస్టర్ చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా సినీ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించడంతో ఈ చిత్ర రిలీజ్ పై మరింత ఆసక్తి నెలకొంది.
తాజాగా యశోద చిత్ర బృందం మూవీ ప్రమోషన్ లో భాగంగా చిత్ర నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ యశోద మూవీ బడ్జెట్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ప్రేక్షకులతో పంచుకున్నారు. యశోద చిత్రాన్ని మొదట మూడు కోట్ల బడ్జెట్ తో నిర్మించాలనుకున్నారు. అయితే యశోద చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా రూపొందించాలనుకున్నప్పుడు సినిమా పూర్తి అయ్యే సమయానికి ఏకంగా 40 కోట్ల రూపాయలు ఖర్చయిందని నిర్మాత కృష్ణ ప్రసాద్ చెప్పారు. ఈ కథకు గ్లోబల్ ఆపిల్ ఉందనే నమ్మకంతో అన్ని ప్రాంతాల, అన్ని భాషల సినిమా అభిమానులకు రీచ్ అయ్యేవిధంగా ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించామని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.
భారీ అంచనాలతో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న యశోద మూవీ హీరోయిన్ సమంత కెరీర్ లోనే గొప్ప సినిమాగా నిలుస్తుందని చిత్ర యూనిట్ మరియు సమంత అభిమానులు భావిస్తున్నారు.ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఈనెల ఆగస్టు 12న థియేటర్లో సందడి చేయాల్సిన ఈ సినిమాను కొన్ని కారణాలతో మూడు నెలలు పాటు విడుదలను పోస్ట్ పోన్ చేసింది చిత్ర యూనిట్. సినిమా విడుదల ఆగిపోవడంతో సమంతా అభిమానుల్లో కొంత నిరాశ నెలకొంది.