హీరో మోటో కార్ప్ యాడ్ కోసం చరణ్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలు ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే కాకుండా వారికి వచ్చిన క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ఎన్నో కంపెనీలు వారి ఉత్పత్తులను ప్రమోట్ చేయాలంటూ హీరోల వెంటపడుతున్నారు.ఇప్పటికే ఎంతో మంది టాలీవుడ్ హీరోలు ఎన్నో బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకున్న హీరోల చుట్టూ ప్రముఖ కంపెనీలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇలా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న హీరోలతో వారి ఉత్పత్తులను ప్రమోట్ చేయడం వల్ల వారికి ఎంతో లాభం ఉంటుందని భావించిన కంపెనీలు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న హీరోల చేత పెద్ద ఎత్తున వారి ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్నారు.ఇప్పటికే పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ సైతం త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఈ క్రమంలోనే ఈయన ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా హీరో మోటో కార్ప్ కంపెనీ తమ కంపెనీ ఉత్పత్తి చేస్తున్నటువంటి ద్విచక్ర వాహనానికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాలని రామ్ చరణ్ ను ఆశ్రయించారు.అయితే హీరోకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటానికి అంగీకరించిన రాంచరణ్ ప్రస్తుతం ఈ యాడ్ కి సంబంధించిన షూటింగ్ హైదరాబాదులో జరుగుతుంది.అయితే కేవలం రెండు నిమిషాల నిడివి ఉన్నటువంటి ఈ యాడ్ కోసం రామ్ చరణ్ భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.కేవలం రెండు నిమిషాల యాడ్ కోసం ఈయన 8 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.