ఈ ఏడాది టాలీవుడ్ కి మాత్రం ఓ నైట్ మేర్ అని చెప్పి తీరాలి. తెలుగు సినిమాకి చెందిన ఎంతో మంది సీనియర్ మోస్ట్ నటులు వరుసగా కన్ను మూయడం ఈ ఏడాది లోనే జరుగుతూ ఉండడం షాకింగ్ గా మారిందని చెప్పాలి. ఇదివరకే కృష్ణం రాజు అలాగే సూపర్ స్టార్ కృష్ణ లాంటి స్టార్ లు కన్ను మూయగా..
ఇప్పుడు మరో అగ్ర నటులు సహా దర్శక, రాజకీయ వేత్త శ్రీ కైకాల సత్యన్నారాయణ కూడా ఇక లేరు అనే మాటతో ఈరోజు ఉదయం టాలీవుడ్ కి మొదలైంది. అవును ఇది నిజమే కైకాల సత్యన్నారాయణ ఈ ఉదయం అయితే చికిత్స పొందుతూ అయితే తన తుది శ్వాస విడిచారు.
మరి కైకాల తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి సిపాయి కూతురు అనే సినిమాతో 1959 లోనే సినిమాలోకి ఎంట్రీ ఇవ్వగా అక్కడ నుంచి తాను తెలుగు సహా దక్షిణాది సినిమా దగ్గర తిరిగి చూసుకోలేదు. ఎన్టీఆర్, ఏ ఎన్నార్ సహా ఎంతో మంది నటులతో స్క్రీన్ పంచుకున్న తాను తెలుగు సినిమా దగ్గర తనదైన ముద్ర వేసుకున్నారు.
అలాగే ఎన్ని అవార్డులు రివార్డులు కూడా అందుకున్న తాను గత కొంత కాలం నుంచి అయితే అనారోగ్యంతో ఉన్నారు. దీనితో పాటుగా వయసు కూడా మీద పడుతూ ఉండడంతో పరిస్థితి మారింది. ఇక దీనితో ఈరోజు తాను తన 87వ ఏట కన్ను మూసినట్టుగా చిత్ర పరిశ్రమ నిర్దారణ చేసింది. అయితే తాను చివరి సారిగా సూపర్ స్టార్ మహేష్ నటించిన “మహర్షి” లో అయితే కనిపించారు.