షాకింగ్ : “గుంటూరు కారం” కథా పాయింట్ లీక్.!

టాలీవుడ్ ఎవర్ గ్రీన్ చార్మింగ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇప్పుడు తన హ్యాట్రిక్ దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్న భారీ ఏక్షన్ కం మాస్ మసాలా డ్రామా “గుంటూరు కారం” కోసం అందరికీ తెలిసిందే. కాగా ఈ చిత్రంలో యంగ్ సెన్సేషన్ శ్రీ లీల అలాగే మరో హాట్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

మరి మొదటి నుంచి కూడా భారీ మార్పులు చేర్పులుతో ఇపుడు వరకు వచ్చిన ఈ చిత్రం అయితే దర్శకుడు త్రివిక్రమ్ ఎలాంటి కథా పాయింట్ తో తీసుకొస్తున్నారు అనేది మాత్రం ఇంకా ఎలాంటి బజ్ లేదు. అయితే లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ అంశం ఈ సినిమా కథ పట్ల లీక్ అయ్యినట్టుగా తెలుస్తుంది.

దీనితో సినిమా కథ ఎలా ఉంటుంది అంటే ఇందులో హీరో గుంటూరులో ఓ అజ్ఞ్యాత డాన్ కాగా తాను ఓ యంగ్ జర్నలిస్ట్ ని చూసి లవ్ లో పడతాడు. అయితే ఆమె సాయంతో అక్కడ ఇల్లీగల్ గా జరుగుతున్నా అక్రమాలని తాను ఎలా అడ్డుకున్నాడు అనేది మెయిన్ పాయింట్ అంటూ గుంటూరు కారం కథ ఇదే అంటూ చిన్న లైన్ అయితే ఇప్పుడు లీక్ అయ్యింది.

మరి ఈ కథ తోనే సినిమా వస్తుందా లేక వేరే స్టోరీ లైన్ ఉంటుందా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఇక ఈ చిత్రంలో జగపతిబాబు తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది జనవరి 12న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.