ఫ్యాన్స్ తమ అభిమాన తారల పట్ల చాలా అఫెక్షన్ చూపిస్తుంటారు. వారు ఎక్కడైనా కనిపిస్తే వారికి షేక్ హ్యాండ్ ఇవ్వాలని, ఫోటో తీసుకోవాలని తహతహలాడుతుంటారు. ఒకప్పుడు ఆటోగ్రాఫ్ ల కోసం ఎగబడే వారు ఇప్పుడు సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. తాము వెళ్లినప్పుడు వాళ్లు కూడా సెల్ఫీ దిగితే ఆనందంగా ఫీల్ అవుతుంటారు. అయితే కొందరు ఫ్యాన్స్ చేసే పిచ్చి వేషాల వల్ల కొంత మంది సెలబ్రిటీలు ఇబ్బంది పడుతుంటారు. ఫ్యాన్స్ అతికి వారికి ఓపిక నశించి పోతుంది. ఒక్కొక్కసారి కొందరు హీరోలు అభిమానులను కొడుతుంటారు, మరికొందరు వార్నింగ్ ఇస్తుంటారు, ఇంకొందరు ఫ్యాన్స్ ను పక్కక తోసేసి వెళ్లిపోతుంటారు. కొంత మంది వారి ఫోన్ విసిరేస్తుంటారు.
తాజాగా రణబీర్ కపూర్ కూడా అదే పని చేశాడు. ఒక ఫ్యాన్ సెల్ఫీ కోసం వచ్చి ఓపిక నశించేలా చేశాడు. దానికి కోప్పడ్డ బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ అతడి ఫోన్ తీసుకుని పక్కకు విసిరేశాడు. ఇప్పుడు ఆ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారింది. సోషల్ మీడియాల్లో దానికి సంబంధించిన వీడియో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేసిన బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ ‘షాకింగ్ రణబీర్ కపూర్ ఫ్యాన్ ఫోన్ విసిరేశాడు!! #Ranbirkapoor #Controvery’ అనే క్యాప్షన్ ఇచ్చాడు.
ఈ వీడియో కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్టుపై కొందరు కామెంట్ చేశారు. కొందరు ఫ్యాన్ తిక్క కుదిరిందని, అలా అంతసేపు సెల్ఫీలు తీసుకుంటూ ఉంటే యాక్టర్స్ కు విసుగు వచ్చేస్తుందని కొందరు కామెంట్లు పెట్టారు. రణబీర్ ను విసుగు తెప్పించడం వల్ల అలా ఫోన్ విసిరేశాడని మరో యూజర్ కామెంట్ చేశాడు. చాలా మంది ఈ వీడియో వెనక ఉద్దేశాన్ని కనిపెట్టారు. యాడ్ షూటింగ్ వీడియో అని ఒక యూజర్ కామెంట్ పెట్టాడు. ఇది యాడ్ షూట్ వీడియో, సరైన క్యాప్షన్ పెట్టండి. ప్రజలను ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు.
అయితే ఇదంతా ఓ యాడ్ షూట్ లో భాగమని తర్వాత నిజం తెలిసింది. దీనికి సంబంధించి పూర్తి యాడ్ త్వరలోనే రాబోతుందని సమాచారం. మరోవైపు ప్రస్తుతం రణబీర్ శ్రద్ధా కపూర్ తో కలిసి లవ్ రంజన్ సినిమా చేస్తున్నాడు. అలాగే సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో యానిమల్ మూవీ చేస్తున్నాడు.