షాకింగ్ : ఈ తెలుగు బాబాని నమ్ముతున్న స్టార్ హీరోయిన్స్.!

Nidhi agarwal shares her experience with pawan kalyan

ఇప్పుడు టాలీవుడ్ సహా కోలీవుడ్ ఇతర ఇండస్ట్రీ లలో కూడా యమ బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. మరి వరుస భారీ ఆఫర్స్ తో దూసుకెళ్తున్న ఈ స్టార్ హీరోయిన్స్ లో కొందరు అయితే షాకింగ్ గా ఓ బాబా వెంట పడుతూ ఉండడం షాకింగ్ అంశంగా మారింది.

మరి అందులో కూడా వారు ఏదో నేషనల్ వైడ్ గా బాగా పాపులర్ అయ్యిన బాబా లనో ఎవరినో కూడా ఫాలో అవ్వట్లేదు మన తెలుగు మీడియాలో సంచలనంగా మారిన వేణు స్వామి ని వారు ఆశ్చర్యకరంగా ఫాలో అవుతూ ఉండడం గమనార్హం. అయితే ఈ వేణు స్వామి గతంలో చాలా మంది నటులు పొలిటిషియన్స్ మీద కూడా సంచలన జోస్యం చెప్పారు.

మరి అతని వెంట ఇప్పుడు పలువురు స్టార్ హీరోయిన్స్ వెళ్లి పూజలు హోమాలు జరిపించుకుంటున్నారు. లేటెస్ట్ గా అయితే నేషనల్ క్రష్ రష్మికా మందన్నా ఈ వేణు స్వామి దగ్గరకి వెళ్లి పూజలు జరిపించుకుంది. దీనితో ఈ విజువల్స్ కొన్ని వైరల్ గా మారాయి. అంతే కాకుండా ఈమెతో పాటుగా ఇప్పుడు మరో గ్లామరస్ హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా అతని దగ్గర ఏదో హోమం జరిపించుకున్నట్టుగా తెలుస్తుంది.

దీనితో అసలు మన హీరోయిన్స్ కి ఏమయ్యింది అనే టాక్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. కాగా నిజంగానే వారి కెరీర్ మరింత బాగుండాలని చేస్తున్నారా లేక వేరే కారణాలు ఉన్నాయా అనేది సోషల్ మీడియాలో చర్చగా మారింది. ఇక ఇంత స్టార్డం ఉన్న వారు కూడా ఇలాంటివి ఎందుకు నమ్ముతున్నారో అందులోని వేణు స్వామి లాంటి వాళ్ళని అనుకోని కొందరు పెదవి విరుస్తున్నారు.