32 భాషల్లో సూర్య సినిమా..అయ్యే పనేనా??

తమిళ నాట అపారమైన ఆదరణ ఉన్న స్టార్ హీరోస్ లో విలక్షణ హీరో సూర్య కూడా ఒకడు. బయట చూడడానికి చాలా సాఫ్ట్ గా ఉన్నప్పటికీ సూర్య కెమెరా ముందుకు వస్తే మాత్రం తన నటనతో ఒక డైనమైట్ లా పేలుతాడు. అలా ఇప్పటివరకు ఎన్నో సాలిడ్ పాత్రలు తాను చేయగా ఇప్పుడు తన కెరీర్ లోనే ఓ బిగ్గెస్ట్ సినిమాని అయితే చేస్తున్నాడు.

మరి ఆ సినిమానే “కంగువ”. దర్శకుడు శివతో చేస్తున్న ఈ చిత్రం సూర్య కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ తో భారీ అంచనాలు తాను అందుకోగా ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడే 10 భాషల్లో రిలీజ్ అంటూ మాసివ్ అప్డేట్ అందించారు.

కానీ లేటెస్ట్ గా సినిమా నిర్మాత మాట్లాడుతూ 10 కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాని ఏకంగా 32 భాషల్లో అందులోని ఐమ్యాక్స్ వెర్షన్ లో కూడా విడుదల చేస్తున్నాం అంటూ కన్ఫర్మ్ చేయడం ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. అయితే ఇప్పుడు పాన్ ఇండియా ఐదు భాషల్లో రిలీజ్ చేయడమే ఓ సినిమాకి కష్టం అయిపోతుంది.

అలాంటిది ఏకంగా 32 భాషల్లో అంటే ఆలోచించాల్సిందే మరి. కాగా సూర్య నటించిన గత స్ట్రైట్ చిత్రం “ఈటి” పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ అని చెప్పి లాస్ట్ కి తెలుగు తమిళ్ లో మాత్రమే రిలీజ్ చేశారు. మరి కంగువ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. కాగా ఈ చిత్రంలో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.