షాకింగ్ : ఓటిటిలో నయనతార సినిమా తొలగింపు..డీటెయిల్స్ 

సౌత్ ఇండియా సినిమా దగ్గర మంచి క్రేజ్ అండ్ మార్కెట్ ఉన్నటువంటి హీరోయిన్స్ లో తమిళ నటి నయనతార కూడా ఒకరు. కాగా నయనతార హీరోయిన్ గా కంటే ఇప్పుడు ఎక్కువ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుండగా ఆమె చేసిన లేటెస్ట్ ఓ సినిమానే ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో అయితే విడుదల అయ్యింది.

కాగా ఆ చిత్రమే “అన్న పూరణి”. మరి ఈ చిత్రాన్ని దర్శకుడు నీలేష్ కృష్ణ తెరకెక్కించగా ఈ సినిమా రిలీజ్ అయ్యిన రోజు నుంచే కాంట్రవర్సీలలో ఇరుక్కుంది. కాగా ఈ సినిమాలో హిందూ సంప్రదాయాలని మంటగలిపేలా సన్నివేశాలు ఉన్నాయని అలాగే ఈ సినిమాతో లవ్ జిహాద్ ని ప్రోత్సహిస్తున్నారు అని నేషనల్ పార్టీల వారు కంప్లైంట్ రైజ్ చేయగా ఎఫ్ ఐ ఆర్ కూడా నమోదు అయ్యింది.

అయితే ఈ సినిమా కోసం మరింతమందికి తెలియగా గత రెండు రోజులు నుంచి అయితే సోషల్ మీడియాలో కూడా ఇలాంటి సినిమాలు స్ట్రీమింగ్ చేస్తున్నందుకు నెట్ ఫ్లిక్స్ ని బాయ్ కాట్ చెయ్యాలని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఇప్పుడు ఈ కాంట్రవర్సీ మరింత స్థాయిలోకి వెళ్తుండగా నెట్ ఫ్లిక్స్ అయితే వెనకడుగు వేసింది.

ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ లో తీసేసారు. దీనితో ఇపుడు ఒకింత వాతావరణం చల్లబడింది. మరి ఈ సినిమా కాంట్రవర్సీకి ఇది పూర్తి ముగింపా కాదా అనేది చూడాలి. ఈ చిత్రానికి అయితే రేటింగ్స్ కూడా చాలా దారుణంగా చూసినవారు అందించారు.