షాకింగ్ : “దసరా” కి తాగి షూటింగ్ చేసిన నాని.!

టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరోస్ లో నాచురల్ స్టార్ నాని కూడా ఒకరు. మరి నాని హీరోగా ఇప్పుడు కంప్లీట్ గా మారిపోయి చేసిన భారీ పాన్ ఇండియా సినిమానే “దసరా”. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ సినిమా ఓ పీరియాడిక్ మాస్ డ్రామాగా తెరకెక్కింది.

ఇక రీసెంట్ గానే సినిమా ట్రైలర్ రావడం దానికి పాన్ ఇండియా లెవెల్లో క్రేజీ రెస్పాన్స్ రావడం కూడా జరిగింది. కాగా ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్న టీం అనేక ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. అయితే ఈ ప్రమోషన్స్ లోనే సినిమా పై ఓ షాకింగ్ ఫ్యాక్ట్ ఇప్పుడు బయటకి వచ్చింది.

ఈ సినిమా షూటింగ్ లో అయితే నాని నిజంగానే మద్యం తాగి పాల్గొన్నాడట. అయితే ఇలాంటి వార్తలు పర్సనల్ గా వింటూ ఉంటాము కానీ ఈ సినిమాకి నాని నిజంగానే తాగి నటించాడట. అయితే దీని వెనుక బ్యాక్ స్టోరీ కూడా ఉంది. నాని తాగి నటించడమే ఓ షాకింగ్ అంటే నాని ని తాగి నటించమంది కూడా ఎవరో కాదు దర్శకుడే అట.

అయితే దీనికి కారణం సినిమాలో కొన్ని సీన్స్ మరింత సహజంగా రావడం కోసమే నాని తో కొంతమేర మద్యం తీసుకునేలా చెప్పి కావాల్సిన సీన్స్ ని చేయించారట. దీనితో ఆ సీన్స్ తాను అనుకున్నట్టుగా వచ్చాయని నాని లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపారు. కాగా ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా మార్చ్ 30 న గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.