షాకింగ్ : అప్పుడే స్టార్ట్ అయ్యిన “గుంటూరు కారం” డౌన్ ఫాల్.. 

టాలీవుడ్ సినిమా నుంచి ఈ ఏడాదిలో అది కూడా టైర్ 1 హీరోస్ నుంచే వచ్చిన అవైటెడ్ మాస్ చిత్రం “గుంటూరు కారం”. మరి భారీ అంచనాలు నడుమ మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ పై ఉన్న హైప్ తో రిలీజ్ ఈ చిత్రం వచ్చింది. కానీ అనూహ్యంగా ఈ సినిమా అంచనాలు అయితే అందుకోలేకపోయింది అనే టాక్ వచ్చేసింది.

కాగా ఈ సినిమా మహేష్ గత చిత్రాల్లానే కాస్త డివైడ్ టాక్ తోనే స్టార్ట్ అయ్యింది కానీ ఈ సినిమా కూడా మహేష్ వల్ల మాత్రమే లాగుతుంది అని ఇంకా కొంతమంది నమ్ముతున్నారు. కానీ ఈ సినిమా మాత్రం ఆల్రెడీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది. చిన్న చిత్రం హనుమాన్ తో పోటీకి వచ్చింది మొదటి రోజు బుకింగ్స్ పరంగా దానిని డామినేట్ చేసింది.

కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఆన్లైన్ బుకింగ్స్ లో ఈ చిత్రం ఇప్పుడు హనుమాన్ ని రీచ్ కాలేకపోతుంది. షాకింగ్ గా ఇప్పుడు గుంటూరు కారం కంటే హనుమాన్ బుకింగ్స్ ఎక్కువగా నమోదు అవుతున్నాయి. దీనితో గుంటూరు కారం సినిమాని హనుమాన్ డామినేట్ చేసేసింది అని చెప్పాలి.

కాగా మొదటి రోజు ఫుల్ స్వింగ్ లో ఉన్న గుంటూరు కారం బుకింగ్స్ రెండో రోజుకే ఇలా పడిపోవడంతో ఈ బుకింగ్స్ చూసి ట్రేడ్ పండితులు కూడా షాక్ అవుతున్నారు. ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ కి కూడా మాట రావడం లేదు. మరి పండుగ మూమెంట్ లో ఏమన్నా గుంటూరు కారం మళ్ళీ మహేష్ బాబు మార్క్ తో పైకి లేస్తుందో లేదో చూడాలి.