ఏ సినీ ఇండస్ట్రీలో అయినా కూడా ఓ స్టార్ హీరోస్ కి మంచి క్రేజ్ అండ్ మార్కెట్ ఉండడం అనేది చాలా కామన్ కానీ హీరోయిన్స్ లో కూడా ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉండడం అనేది కొంచెం తక్కువే అని చెప్పాలి. అలాంటి స్టార్ హీరోయిన్స్ లో తమిళ సూపర్ స్టార్ హీరోయిన్ నయనతార కూడా ఒకామె.
కాగా నయన్ కెరీర్ లో హీరోయిన్ గా సెకండ్ హీరోయిన్ గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు తన సినిమాలకి అంటూ సెపరేట్ మార్కెట్ ని సెట్ చేసుకుంది. మరి దాదాపు సోలో మూవీస్ ఎక్కువ చేస్తున్న తాను నటించిన చిత్రం ఒకటి “అన్నపూర్ణయ్”. కాగా ఈ సినిమా రీసెంట్ గానే ఓటిటిలో విడుదల అయ్యి మంచి రెస్పాన్స్ నే అందుకుంది.
కానీ ఇపుడు ఈ సినిమా విషయంలో నయన్ కి షాక్ తగిలింది. మరి ఈ సినిమాలో హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా పలు సన్నివేశాలు ఉన్నాయ్ అని శివ సేన నాయకుడు రమేష్ సోలంకి కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. లవ్ జిహాద్ ని ఈ సినిమాతో ప్రోత్సహిస్తున్నారు అని కూడా తాను మెన్షన్ చేయగా..
ఇప్పుడు ఈ సినిమాపావు ఎఫ్ ఐ ఆర్ కూడా నమోదు అయ్యినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో ఈ వార్త కోలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మారింది. మరి ఈ సినిమా విషయంలో ఎలాంటి ప్రొగ్రెస్ర్ వెళుతుందో చూడాలి. మరి ఈ చిత్రం ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో తమిళ్ సహా తెలుగులో కూడా అందుబాటులో ఉంది.