షాకింగ్ : చిరంజీవిపై కేసు.. వివరాలు ఇవే 

తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర ఇప్పుడు ఆల్ టైం నెంబర్ 1 హీరో మెగాస్టార్ చిరంజీవి కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇన్నేళ్ల తర్వాత కూడా మంచి బాక్సాఫీస్ స్టామినాని మైంటైన్ చేస్తున్న మెగాస్టార్ నెక్స్ట్ మూవీ కోసం అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే రీసెంట్ గా తన కో స్టార్ అలాగే హీరోయిన్ అయినటువంటి త్రిష కృష్ణన్ పై తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అవి పెద్ద ఎత్తున దుమారం రేపడం కూడా జరిగింది. అయితే ఈ వ్యాఖ్యలని ఖండిస్తూ అనేకమంది బిగ్ స్టార్స్ తో పాటుగా మెగాస్టార్ చిరంజీవి కూడా తన సపోర్ట్ ని త్రిష కి చెప్తూ మన్సూర్ పై మండిపడ్డారు.

అయితే ఇక అయ్యింది ఏదో అయ్యింది అని మన్సూర్ ని ఆమె క్షమించినట్టుగా త్రిష మొన్ననే కన్ఫర్మ్ చేయగా ఇపుడు ఈ ఇష్యూ కొత్త టర్న్ తీసుకుంది. ఇప్పుడు మన్సూర్ మెగాస్టార్ చిరంజీవి పైన అలాగే హీరోయిన్ త్రిష సహా సీనియర్ నటి కుష్భు లపై కేసు వేసినట్టుగా తమిళ సినీ వర్గాలు చెప్తున్నాయి.

ఈ ముగ్గురు అతన్ని డీ ఫేమ్ చేసారని వారిపై తాను కేసు వేసినట్టుగా ఇపుడు వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో ఈ సరికొత్త టర్న్ ఎవరూ ఊహించలేదు. మరి ఈ కేసు విషయం ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి. అయితే మన్సూర్ ఇచ్చిన వవ ట్విస్ట్ తో నెటిజన్స్ కూడా ఒకింత కంగుతిన్నారు.