Samantha – Shobhita Dhulipala: నాగచైతన్య – సమంత విడాకుల అనంతరం, ఇద్దరూ తమ జీవితాల్లో సరికొత్తగా ముందుకు సాగుతున్నారు. నాగచైతన్య ఇటీవల శోభిత ధూళిపాళ్లను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాహం చైతు ఫ్యాన్స్‌కు ఒకింత ఆశ్చర్యకరంగా మారింది. సమంత కూడా తన కెరీర్‌పై పూర్తిగా దృష్టి సారించి, కొత్త ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టింది. అయితే, విడాకుల తర్వాత కూడా చైతన్య, సమంత గురించి వచ్చే వార్తలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాయి.
నాగచైతన్య, సమంత జంటగా రాణించిన రోజుల్లో వారి కెమిస్ట్రీ గురించి అనేక మంది చర్చించేవారు. విడాకుల తర్వాత కూడా చైతన్య తనకు స్క్రీన్ మీద బాగా సెట్ అయిన హీరోయిన్ సమంతేనని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో చర్చకు దారితీశాయి. సమంత కూడా నాగచైతన్యతో నటించిన అనుభవాన్ని ఎంతో ప్రత్యేకంగా చెప్పుకొచ్చింది. ఇద్దరూ తమ వ్యక్తిగత జీవితాల్లో ముందుకు సాగినా, వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ మాత్రం అభిమానుల మదిలో నిలిచిపోతూనే ఉంది.
ఇదిలా ఉంటే, తాజాగా శోభిత ధూళిపాళ్ల కూడా సమంత గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. “తన సినిమాల్లో ఎన్నో మంచి ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే ఆ ప్రాజెక్ట్స్‌ను ఎంచుకునే విధానం ఎంతో ముఖ్యం. సమంత చేసిన సినిమాలు, ఆమె ఎంచుకున్న పాత్రలు చూస్తే నిజంగా బాగుంటాయి. అలాగే ఆమె జీవితం ఆదర్శం అని” అని వివరణ ఇవ్వడం వైరల్ అవుతోంది. ఈ వ్యాఖ్యలతో ఆమె సమంతను పరోక్షంగా ప్రశంసించినట్లు కనిపిస్తోంది. సమంత నటన, స్క్రిప్ట్ సెలక్షన్‌పై శోభిత మాట్లాడడం ఆసక్తికరంగా మారింది.
సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కొందరు పాజిటివ్ గా స్పందిస్తుంటే.. మరికొందరు మాత్రం సమంత గురించి మాట్లాడటమే అవసరమా? అంటూ విభిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం సమంత సినిమాల విషయంలో కొత్త ప్రాజెక్ట్‌లపై చర్చలు జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, నాగచైతన్య ‘తండేల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక శోభిత కూడా బాలీవుడ్‌లో తన అవకాశాలను విస్తరించుకునే పనిలో ఉంది.