విశ్వక్ సేన్ కు బాహుబలి కౌంటర్?

ఒక సినిమా సక్సెస్ అయితే కొంతమంది యువ హీరోలు ప్రవర్తిస్తున్న తీరు చాలామందికి అసంతృప్తిని కలిగిస్తోంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలు కూడా ఈ విషయంపై ఇన్ డైరెక్ట్ గా సెటైర్లు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో అలాంటి వివాదాలతో చాలా హాట్ టాపిక్ గా నిలిచాడు యువ హీరో విశ్వక్ సేన్.

ఇదివరకే ఇతను సీనియర్ నటుడు అర్జున్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకొని మళ్లీ మొదలుపెట్టిన తర్వాత వెనక్కి తగ్గాడు. ఆ తరువాత అర్జున్ కూడా మీడియా ముందుకు వచ్చి అతని ప్రవర్తన గురించి ఏ విధంగా క్లారిటీ ఇచ్చాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అయితే ఇటీవల బేబీ సినిమా దర్శకుడు సాయి రాజేష్ కూడా ఒక హీరోకు కథ చెప్పడానికి వెళితే.. అతను అయితే హృదయ కాలేయం సినిమా చేశానని.. అసలు కథ వినను అని చెప్పడం తనను చాలా బాధించింది అని అన్నాడు. ఇక ఆ హీరో విశ్వక్ సేన్ కూడా అందరికీ అప్పుడే క్లారిటీ వచ్చింది. విశ్వక్ కూడా ఆ కామెంట్స్ కు ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చాడు.

ఇక ఇప్పుడు బాహుబలి నిర్మాత శోభ యార్లగడ్డ సోషల్ మీడియాలో పేరు చెప్పకుండానే యువ హీరోకి కౌంటర్ ఇచ్చినట్లుగా కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో హీరోలు ఒక సక్సెస్ అందుకోగానే చాలా పొగరుగా ప్రవర్తిస్తున్నారు అని కొత్తగా వచ్చే డైరెక్టర్స్ కథలు వినడానికి కూడా అవమానకరంగా వ్యవహరిస్తున్నారు అని అన్నారు.

అలాగే సక్సెస్ను హ్యాండిల్ చేయడం కరెక్ట్ గా నేర్చుకోవాలి అని ఇది సరైన పద్ధతి కాదు అంటూ శోభు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఇక వైరల్ అయిన కొద్దిసేపటికి ఆయన డిలీట్ చేయడం కూడా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అయినప్పటికీ హీరో పేరును బయటకు చెబుతూ నెటిజన్లు విభిన్నమైన తరహాలో రియాక్ట్ అవుతున్నారు.