చిరు హృదయాన్ని కదిలించిన శివరాజ్ కుమార్.!

టాలీవుడ్ మాస్ మూలవిరాట్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు భారీ చిత్రం “విశ్వంభర” చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ రీసెంట్ గానే స్టార్ట్ చేయగా ఈ కొన్ని రోజులు ముందే మెగాస్టార్ కి అరుదైన గౌరవం పద్మవిభూషణ్ కూడా వచ్చింది.

దీనితో మెగా ఫ్యాన్స్ సహా టాలీవుడ్ ఆడియెన్స్ లో కూడా ఈ న్యూస్ ఎంతో గౌరవప్రదంగా మారగా చిరంజీవికి అయితే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సత్కారం కూడా అందించింది. కాగా ఈరోజే మెగాస్టార్ మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ని షేర్ చేయడం వైరల్ గా మారింది.

తన కోసం తనని అభినందించేందుకు కన్నడ నటుడు శివరాజ్ కుమార్ బెంగళూరు నుంచి ప్రత్యేకంగా రావడం నా హృదయాన్ని టచ్ చేసింది అని లెజెండరీ శివ రాజ్ కుమార్ గారు రావడం తనతో ఎంతో విలువైన సమయాన్ని గడపడం మళ్ళీ పాత జ్ఞ్యాపకాలు నెమరు వేసుకోవడం జరిగింది అని..

వారిద్దరూ కలిసిన ఫోటోలు చిరు ఇంట్లో తాము ఇద్దరూ ఆప్యాయంగా భోజనం చేస్తున్న ఫోటోలను తాను షేర్ చేసి శివ రాజ్ కుమార్ కోసం మెగాస్టార్ పోస్ట్ పెట్టడం వైరల్ గా మారింది. కాగా ఇప్పుడు శివ రాజ్ కుమార్ చిరు వారసుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ భారీ చిత్రంలో ముఖ్య పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.