Beast: బాద్ షా కు నచ్చిన బీస్ట్… విజయ్ అభిమానిని అంటూ షాక్ ఇచ్చిన షారుఖ్…!

Beast: తమిళ్ సినిమా హీరో దళపతి విజయ్ వరుస సినిమా విజయాలతో మంచి ఫామ్ లో ఉన్నారు. మాస్టర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వరుస హిట్లతో దూసుకుపోతున్నారు.ఇటీవల వచ్చిన విజయ్ సినిమాలకి తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం విజయ్ హీరోగా వస్తున్న బీస్ట్ సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.నెల్సన్ దిలీప్ ఇది వరకే డాక్టర్ వంటి సినిమా తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు. అందుకే ఈ సినిమా మీద అంచనాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి.

అయితే ఈ చిత్రాన్ని ఏప్రిల్ 13 న ఈ సినిమాను అన్ని భాషల్లో విడుదల చేయడానికి సిద్ధంగా వున్నారు.ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన ప్రమోషన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల ఐన హలమితి హబిబో పాట ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో తెలిసిందే.తరువాత వచ్చిన జాలీ ఓ జింఖానా పాట కూడా అదరగోట్టేసింది.ప్రస్తుతం ఈ సినిమా కి సంబందించిన ఒక విషయం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తాను కోలీవుడ్ స్టార్ విజయ్ కు అభిమానిని అంటూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.అంతే కాకుండా ‘బీస్ట్’ హిందీ ట్రైలర్‌ను ఆవిష్కరిస్తూ దళపతి విజయ్ అభిమానులను షారుఖ్ ఆశ్చర్యానికి గురి చేశాడు.ఈ సందర్భంగా షారుఖ్ ‘అట్లీతో కలిసి కూర్చున్నాను. ఇకపోతే విజయ్ కి అట్లీ ఎంత పెద్ద అభిమానో నేను కూడా అంతే పెద్ద అభిమానిని. ‘బీస్ట్’ టీంకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక ట్రైలర్ స్ట్రాంగ్ గా ఉంది!!’ అంటూ ట్వీట్ చేశారు. ఇక షారుఖ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అభిమానులను ఆనందానికి గురించేస్తోంది.ఈ ట్రైలర్ కి కూడా విశేష స్పందన వస్తోంది.