పాన్ ఇండియా సెన్సేషనల్ దర్శకుడు శంకర్ నుంచి చాలా కాలం తర్వాత రాబోతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటి “ఇండియన్ 2”. తమిళ స్టార్ హీరో ఉలగనయగన్ కమల్ హాసన్ హీరోగా 1996లో వచ్చిన భారీ హిట్ చిత్రం ఇండియన్ కి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని చేస్తుండగా..
ఈరోజు అయితే అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒక కం బ్యాక్ ఇండియన్ వీడియోని రిలీజ్ చేశారు. అయితే ఈ వీడియో డెఫినెట్ గా శంకర్ మార్క్ లో కనిపిస్తుంది. కానీ చాలా మంది ఏక్షన్ తరహాలో ఆశించి ఉండొచ్చు కానీ ఇది డిఫరెంట్ గా ఎంటర్టైనింగ్ కోణంలో మాత్రమే ఉంది అని చెప్పాలి.
ఇన్నేళ్లు అయినా కూడా ఇండియా ఎలాంటి మార్పు చెందలేదు 1996 నుంచి 2023 లో కూడా అవే లంచాలు అవినీతి దీనితో సోషల్ మీడియాలో ట్రెండ్ స్టార్ట్ చేసిన జనం ఇండియన్ రాక కోసం ఎదురు చూస్తుండగా తాను మళ్ళీ తిరిగి వస్తాను అన్నట్టుగా చూపించారు.
అయితే ఇందులో అనిరుద్ మ్యూజిక్ చాలా డిజప్పాయింట్ గా ఉంది. కానీ శంకర్ మాత్రం మళ్ళీ తన మార్క్ కొత్త గ్రాండ్ విజువల్స్ తో మ్యాజిక్ చేయనున్నారు అనేది మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది. కాగా ఇంకా ఈ వీడియోలో సిద్ధార్థ్ కూడా కనిపిస్తున్నాడు. కాగా ఈ వీడియోని అయితే తెలుగు నుంచి రాజమోళి రిలీజ్ చేశారు. ఇక నెక్స్ట్ వచ్చేవి ఏమన్నా మరింత హైప్ ఇస్తాయేమో చూడాలి.