హిరాణీ దర్శకత్వంలో షారూఖ్‌ డంకీ

జవాన్‌ తర్వాత బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ నటించనున్న సినిమా డంకీ. రాజ్‌ కుమార్‌ హిరాణీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో షారుఖ్‌ ఖాన్‌ సరసన తాప్సీ పన్ను నటిస్తుంది. డిసెంబర్‌ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఈ ఏడాది మోస్ట్‌ అవైటెడ్‌ మూవీస్‌లో ఒకటి అయిన ఈ సినిమా ఇప్పటికే సగనికి పైగా షూటింగ్‌ కప్లీంట్‌ చేసుకుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. దీపావళి కానుకగా షారుఖ్‌ డంకీ సినిమా టీజర్‌ ను విడుదల చేయడానికి మేకర్స్‌ ఎª`లాన్‌ చేస్తున్నారని టాక్‌. దీపావళికి విడుదల కానున్న సల్మాన్‌ ఖాన్‌ టైగర్‌ జిందా హై 3 (టైగర్‌ త్రీ)తో పాటు డంకీ టీజర్‌ను మేకర్స్‌ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఒకవేళ అదే నిజమైతే అటు షారుఖ్‌ ఫ్యాన్స్‌తో పాటు ఇటు సల్మాన్‌ ఫ్యాన్స్‌కు పండగ అనే చెప్పుకోవాలి.

కాగా దీనిపై అధికారిక సమాచారం కొరకు మరింత సమయం వేచి చూడాల్సి ఉంది. డ్రామా, రొమాన్స్‌ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను జియో స్టూడియోస్‌ , రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, రాజ్‌కుమార్‌ హిరానీ ఫిల్మ్స్‌ బ్యానర్‌లో హిరానీ, గౌరీ ఖాన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బోమన్‌ ఇరానీ , విక్కీ కౌశల్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్‌ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.