డిజాస్టర్ వసూళ్లతో స్ట్రగుల్ అవుతున్న “శాకుంతలం”.!

Shaakuntalam

సౌత్ ఇండియా సినిమా దగ్గర మంచి స్టార్డం ఉన్న హీరోయిన్స్ లో అయితే సమంత ప్రభు కూడా ఒకరు. మరి సమంత రీసెంట్ గా నటించిన పాన్ ఇండియా సినిమా “యశోద” తో సూపర్ హిట్ అందుకుంది. ఇక నెక్స్ట్ గా వచ్చిన మరో పాన్ ఇండియా సినిమా “శాకుంతలం” తో అయితే వచ్చింది.

మరి ఈ సినిమా భారీ విజువల్ డ్రామాగా రాగా దీనికి షాకింగ్ వసూళ్లు అయితే మొదటి రోజు వరల్డ్ వైడ్ గా నెలకొన్నాయి. మొదటి రోజు ఈ సినిమాకి 3 కోట్ల గ్రాస్ కూడా దాటలేదు. దీనితో డిజాస్టర్ ఓపెనింగ్స్ అందుకున్న ఈ సినిమా రెండో రోజు కూడా మరింత దారుణమైన వసూళ్లు రిజిస్టర్ చేసినట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ సినిమా రెండో రోజు వసూళ్లు ఎలా ఉన్నాయి అంటే దీనికి ముందు వచ్చిన దసరా అలాగే నిన్న వచ్చిన విడుదల తాలూకా వసూళ్లే ఎక్కువ నమోదు అవుతున్నట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ సినిమా డిజాస్టర్ వసూళ్లు ఇప్పుడు రిజిస్టర్ చేస్తుంది అని చెప్పక తప్పదు.

అలాగే ఎంతో బడ్జెట్ పెట్టి తీసిన ఈ సినిమా భారీ నష్టాలు మిగిల్చే లానే ఉందని చెప్పాలి. ఇక ఈ సినిమాలో అయితే దేవ్ మోహన్ హీరోగా నటించగా గుణశేఖర్ దర్శకత్వం వహించారు. అలాగే మణిశర్మ సంగీతం అందించగా దిల్ రాజు నీలిమ గుణ నిర్మాణం వహించారు.