శాకుంతలం.. అర్హ పాత్ర ఎలా ఉందంటే?

అల్లు అర్జున్ గారాల కుమార్తె, అల్లు అర్హ, గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “శాకుంతలం” సినిమాతో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సమంతా ప్రధాన పాత్రలో నటించింది. ఇక హైదరాబాద్‌లో ప్రీమియర్ షోలను ప్రదర్షించగా మంచి క్రేజ్ దక్కింది. ఇక చూసిన వారు అల్లు అర్హా నటనా నైపుణ్యాలు ఆకట్టుకునేలా సహజంగా ఉన్నాయని చెబుతున్నారు.

సాధారణంగా, తన వయస్సులో ఉన్న పిల్లలు ఎక్కువసేపు కెమెరా ముందు నిలబడటం సవాలుగా ఉంటుంది, కానీ అర్హా గుణశేఖర్ మార్గదర్శకత్వంలో స్వచ్ఛమైన తెలుగులో సుదీర్ఘమైన డైలాగ్‌లను సులభంగా అందించగలిగిందని అంటున్నారు. చిన్నప్పటి బరతుడి పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందట. చూసినవారు తప్పకుండా అర్హను అభినందిస్తారని తెలుస్తోంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ ఇమేజ్ ఉన్న తండ్రి వారసులిగా అడుగు పెట్టిన అర్హ ఇలానే కొనసాగితే మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పవచ్చు. అర్హా తల్లిదండ్రులు, అల్లు అర్జున్, స్నేహా రెడ్డి, తమ కుమార్తె తొలి నటనకు గర్వపడుతున్నారని తెలుస్తోంది. ఇక అర్హ అందుకున్న ప్రశంసలను చూసి అల్లు ఫ్యామిలీ ఫుల్ సెలబ్రేషన్స్ లో ఉందట. మరి అర్హ భవిష్యత్తులో ఎలాంటి అడుగులు వేస్తుందో కాలమే సమాధానం చెప్పాలి.