ఓటిటి : సైలెంట్ స్ట్రీమింగ్ కి వచ్చేసిన “శాకుంతలం”.!

Shaakuntalam

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర వచ్చిన భారీ డిజాస్టర్స్ లో కొన్ని చిత్రాలు ఈ ఏప్రిల్ నెలలోనే వచ్చాయి. మరి ఆ చిత్రాల్లో చివరగా రిలీజ్ అయ్యిన “ఏజెంట్” ఒకటి కాగా దీనికి ముందు పాన్ ఇండియా సినిమాగా వచ్చిన చిత్రం “శాకుంతలం” కూడా ఒకటి. సమంత ముఖ్య పాత్రలో దేవ్ మోహన్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించారు.

అయితే ఇప్పుడు ఏమాత్రం ఫామ్ లో లేని ఈ దర్శకుడు ప్రయోగాలకి పోయి డిజాస్టర్స్ తో భారీ నష్టాలు మిగులుస్తున్నారు. మరి ఈ శాకుంతలం అయితే నిర్మాత దిల్ రాజు 25 ఏళ్ల కెరీర్ లోనే ఇచ్చింది అని కామెంట్ చేసారు అంటే ఈ సినిమా ఏ రేంజ్ డిజాస్టర్ అనేది అర్ధం చేసుకోవచ్చు.

ఇక థియేటర్స్ నుంచి ఎప్పుడు ఎలా కనుమరుగు అయ్యిపోయిందో తెలియని ఈ చిత్రం ఇప్పుడు ఇదే రకంగా తెలియకుండానే ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వీడియో వారు కొనుగోలు చేయగా ఈ సినిమా ఇప్పుడు ఇందులో తెలుగు, హిందీ. తమిళ్, మలయాళ కన్నడ భాషల్లో వచ్చేయడం షాకింగ్ గా మారింది.

ఎలాంటి అనౌన్సమెంట్ కూడా లేకుండా ఈ సినిమా ఇపుడు ఓటిటి లోకి వచ్చేసింది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతరు అల్లు అర్హ మంచి డెబ్యూ ఇవ్వగా సుమారు 50 కోట్లకి పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. కానీ ఇందులో పావు వంతు కూడా ఈ సినిమా రాబట్టలేదు.