కార్తి హీరోగా లింగు స్వామి దర్శకత్వంలో 2010లో వచ్చిన అవారా మూవీ గుర్తుండే ఉంటుంది. ఈ మూవీ కంప్లీట్ ట్రావెల్ స్టొరీగా ఆవిష్కరించారు. ఈ మూవీలో తమన్నా హీరోయిన్ గా నటించింది. లవ్ స్టొరీని ఈ చిత్రంలో లింగుస్వామీ ఆవిష్కరించాడు. అలాగే యాక్షన్ ఎలిమెంట్స్ కూడా భాగానే ఉంటాయి. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతం అందించారు.
అవారా మంచి మ్యూజికల్ హిట్ అయ్యింది. దీంతో కంటెంట్ కాస్తా కొత్తగా ఉండటంతో కమర్షియల్ సక్సెస్ కూడా అందుకుంది. అయితే బ్లాక్ బస్టర్ అనే టాక్ తెచ్చుకోలేదు. తమిళంలో పయ్యా టైటిల్ తో తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో ఆవారా పేరుతో రిలీజ్ అయ్యింది. తెలుగులో కూడా ఈ సినిమా హిట్ తలాక్ సొంతం చేసుకుంది.
ఇదిలా ఉంటే 14 ఏళ్ళ తర్వాత మరల ఈ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. లింగుస్వామి ఇప్పటికే కార్తికి కథ కూడా చెప్పి ఒకే చేయించుకున్నాడు. ఇక ఈ సీక్వెల్ కి కూడా యువన్ శంకర్ రాజాని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అవారా వచ్చే సమయంలో యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కి మంచి డిమాండ్ ఉంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగారు. ఆ సమయంలో అవారా సాంగ్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.
అయితే ప్రెజెంట్ ట్రెండ్ కి యువన్ మ్యూజిక్ పెద్దగా కనెక్ట్ కావడం లేదు. రీసెంట్ గా అతని నుంచి వచ్చిన ఈ మూవీ కూడా మ్యూజికల్ హిట్ కాలేదు. తెలుగులో కస్టడీ సినిమాకి మ్యూజిక్ అందించిన అందులో ఒక్క పాట కూడా చెప్పుకోదగ్గ విధంగా లేదు. ఇలాంటి సమయంలో అవారా సీక్వెల్ అంటే అనవసరమైన రిస్క్ అనే మాట వినిపిస్తోంది.
ప్రస్తుతం కార్తిక్ సర్దార్ హిట్ తో మంచి జోరు మీద ఉన్నాడు. జపాన్ అనే పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాలో కార్తిక్ గెటప్ కొత్తగా ఉండటంతో ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లింగుస్వామీ చివరిగా రామ్ పోతినేనితో ది వారియర్ అనే మూవీ చేశాడు. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. అలాగే తమిళంలో కూడా పెద్దగా సక్సెస్ లు లేవు. ఇలాంటి టైమ్ లో అతనితో అవసరమా అనే మాట వినిపిస్తోంది.