సెన్సేషనల్ “దసరా”..ఒకొక్కరికి 100 కోట్లు ఇచ్చింది.!

రీసెంట్ గా టాలీవుడ్ నుంచి భారీ అంచనాలు నడుమ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యిన చిత్రం “దసరా”. చాలా కాలం తర్వాత టాలీవుడ్ సినిమా నుంచి అయితే మంచి అంచనాలు నడుమ వచ్చింది ఈ సినిమా. కానీ నాచురల్ స్టార్ నాని కీర్తి సురేష్ తదితర స్టార్స్ అంతా కూడా పాన్ ఇండియా లెవెల్లో చాల గట్టి ప్రమోషన్స్ చేసినప్పటికీ ఎక్కువ తెలుగులో కొంచెం హిందీలో తప్ప ఇంకెక్కడా కూడా పెద్దగా మంచి వసూళ్లు నమోదు అవ్వలేదు.

కానీ మొదటి రోజు నుంచి ఓపెనింగ్స్ చూసినట్టు అయితే ఈ సినిమా 100 కోట్లు వసూలు చేయడం ఈజీ అని అంతా అనుకున్నారు. దీనితో ఈ సినిమా అనుకున్నట్టుగానే 100 కోట్ల మార్క్ ని అయితే నిన్న రాత్రి ఆటలతో క్రాస్ చేసేసింది. దీనితో మేకర్స్ కూడా ఓ సెన్సేషనల్ పోస్టర్ తో దీనిని చెప్పడం పైగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా సినిమా పోస్టర్ ని షేర్ చేయడం క్రేజీ అంశం గా మారింది.

అయితే అసలు దసరా 100 కోట్లతో కొన్ని కొత్త రికార్డులు యూనిట్ కి చేరాయని చెప్పాలి. మొదటగా నాని కెరీర్ లో మొదటి ఫాస్టెస్ట్ 100 కోట్ల సినిమాగా దసరా నిలవగా. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన మొదటి సినిమాతోనే 100 కోట్లు సాధించిన దర్శకుల్లో ఒకడిగా నిలిచాడు.

అంతే కాకుండా నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర బ్యానర్ వారికి కూడా మొదటి 100 కోట్ల సినిమాగా దసరా నిల్చింది. దీనితో ఇలా ఒకొకరికి కూడా వెరీ స్పెషల్ గా 100 కోట్ల గ్రాసర్ గా అయితే దసరా ఇప్పుడు నిలిచి భారీ రికార్డు సెట్ చేసింది.