సెన్సేషనల్ బజ్..మొదటిసారి మహేష్ కోసం పవన్?

టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోస్ ఉన్నప్పటికీ ఓ ఇద్దరు హీరోస్ కాంబినేషన్ మాత్రం ఎప్పటికీ ఒక డ్రీం కాంబినేషన్ అని చెప్పాలి. అదే పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబుల కాంబినేషన్ అని చెప్పాలి. ఒక్క ఆన్లైన్ లో గాని ఆఫ్ లైన్ లో గాని వారి ఫ్యాన్స్ హంగామా కానీ బాక్సాఫీస్ దగ్గర హీరోల పెర్ఫామెన్స్ లు విషయంలో కానీ ఎవరికి వారే సాటి.

అలా ఈ క్రేజీ కాంబినేషన్ లో ఒక్క సినిమా పడితే చూడాలి అని ఎప్పుడు నుంచో చాలా మంది అనుకుంటున్నారు. అయితే ఇది ఎప్పుడు సాధ్యం అవుతుందో కానీ పరోక్షంగా మాత్రం మహేష్ మరియు పవన్ లు మాత్రం ఎప్పటికప్పుడు ఒకరి సినిమా కోసం ఒకరు సాయం అందించడంలో ముందు ఉంటారు.

అలా పవన్ కోసం మహేష్ మొదటిసారి తన వాయిస్ ఓవర్ ని “జల్సా” చిత్రానికి ఇవ్వగా అక్కడ నుంచి మళ్ళీ ఈ కాంబినేషన్ లో ఏదన్నా ఇంట్రెస్టింగ్ థింగ్ జరగకుండా ఉంటుందా అని చాలా మంది ఎదురు చూసారు. ఇక ఫైనల్ గా అయితే ఇపుడు మహేష్ “గుంటూరు కారం” విషయంలో జరిగే ఛాన్స్ ఉందని ఓ సెన్సేషనల్ బజ్ ఇప్పుడు వినిపిస్తుంది.

దీనితో మరి మహేష్ కోసం పవన్ మొదటిసారి తన వాయిస్ ఓవర్ ని ఇవ్వనున్నారు అని టాక్ వినిపిస్తుంది. త్రివిక్రమ్ ఎలాగో వీరికి కామన్ ఫ్రెండ్ కాబట్టి జరిగే ఛాన్స్ కూడా ఉంది. కానీ మరి ఇది ఎంతవరకు నిజం అనేది తెలీదు కానీ నిజం అయితే ఫ్యాన్స్ ఆనందానికి మాత్రం హద్దులు ఉండవు.