కన్ఫర్మ్ చేసిన సెన్సార్.. “థాంక్ యూ” సినిమా మరీ ఇంత చిన్నదా.!

Naga Chaitanya Thank You Movie

ఇప్పుడు మన తెలుగు సినిమాల పరిస్థితి ఎలా ఉందో తెలిసిందే. గత జూన్ లో కొన్ని హిట్స్ తర్వాత మళ్ళీ ఏ సినిమాకి కూడా కంప్లీట్ వసూళ్లు రాలేదు. నాని నటించిన అంటే సుందరానికి సినిమాకి మాత్రం ఒక 80 శాతం మేర వసూళ్లు వచ్చినట్టుగా ట్రేడ్ వర్గాల వారు తెలిపారు.

ఇక ఈ చిత్రం తర్వాత వచ్చిన సినిమాలు పరిస్థితి మరింత దారుణం అని చెప్పాలి. తాజాగా వచ్చిన రామ్ మాస్ సినిమా “ది వారియర్” కండిషన్ ఇంకా దారుణంగా ఉంది. దీనికి అయితే ఎలా లేదన్నా సగం నష్టాలు తప్పవని అంటున్నారు. ఇక ఈ చిత్రం అనంతరం బాక్సాఫీస్ దగ్గర అదృష్టం పరీక్షించుకోడానికి వస్తున్న మరో చిత్రం “థాంక్ యూ”.

అక్కినేని నాగ చైతన్య హీరోగా దర్శకుడు విక్రమ్ కే కుమార్ ల నుంచి వస్తున్న మరో సినిమా ఇది కాగా దీనిపై కూడా సో సో గానే అంచనాలు ఉన్నాయి. గట్టిగా మౌత్ టాక్ వచ్చినా కూడా జనం వస్తారో లేదో అనే పరిస్థితి నెలకొంది. మరి ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి సెన్సార్ రిపోర్ట్ అయితే ఇప్పుడు బయటకి వచ్చింది.

అనుకున్నట్టుగానే ఈ సినిమాని చిత్ర బృందం చిన్న సినిమాగానే సెట్ చేశారు. ఈ సినిమా కేవలం రెండు గంటల 9 నిముషాలు మాత్రమే ఉంటుందని సెన్సార్ సెర్టిఫికెట్ లో కనిపించింది. అలాగే యూ/ఏ గా నిర్ధారించారు. మరి ఇది అయితే చాలా తక్కువ నిడివే అని చెప్పాలి.

యాడ్స్ టైటిల్స్ తీసేస్తే సుమారు 2 గంటలు రావచ్చు. మరి ఈ సినిమా ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి. ఇంకా ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం ఇచ్చాడు అలాగే దిల్ రాజు నిర్మాణం అందించారు.