జింగ చిక.. జింగ చిక?.. శేఖర్ మాస్టర్ ప్రియమణి మధ్య ఏదో నడుస్తోంది!!

ఢీ షోలో శేఖర్ మాస్టర్ చేసే రచ్చ గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు కొరియోగ్రాఫర్‌గా వెండితెరపై వెనక ఉండే శేఖర్ మాస్టర్ ఢీ షోతో బుల్లితెరపై రచ్చ రచ్చ చేస్తున్నాడు. ఢీ షోలో వేసే సెటైర్లు, రచ్చతో జబర్దస్త్, స్పెషల్ ఈవెంట్లలోనూ హల్చల్ చేస్తుంటాడు. అలా బుల్లితెర ప్రేక్షకులకు శేఖర్ మాస్టర్ సుపరిచితుడే. అయితే గత కొన్ని రోజులుగా శేఖర్ మాస్టర్ బుల్లితెరపై కనిపించడం లేదు.

Sekhar master Joins In Dhee set After Covid,Sekhar master

శేఖర్ మాస్టర్‌కు కరోనా సోకడంతో కాస్త గ్యాప్ ఇచ్చాడు. కరోనా తగ్గినా కూడా విశ్రాంతి తీసుకుంటూ ఇంటి పట్టునే ఉన్నాడు. కొన్ని రోజులు షూటింగ్‌లంటూ తిరగకుండా ఫ్యామిలీతోనే గడిపాడు. అలా శేఖర్ మాస్టర్ ఇంట్లోనే ఉండటంతో ఢీ షోలో తాత్కాలిక జడ్జ్‌గా బాబా భాస్కర్‌ను దింపారు. బాబా మాస్టర్ కూడా బాగానే ఎంటర్టైన్ చేశాడు. సుధీర్ విషయంలో కాస్త అతి చేయడంతో ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు.

అయితే ప్రస్తుతం శేఖర్ మాస్టర్ ఢీ సెట్‌లోకి అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని చెబుతూ మళ్లీ ఢీ ఫ్యామిలీకి వచ్చాను అని పూర్ణ, ప్రియమణిలతో కలిసి దిగిన ఓ ఫోటోను షేర్ చేశాడు. ఈ ఫోటోకు విమలా రామన్ పెట్టిన కామెంట్‌కు ప్రియమణి అదిరిపోయే కామెంట్ పెట్టింది. వావ్ యస్ ది.. జింగ చిక అని కామెంట్ చేసింది. ప్రియమణి కామెంట్‌కు శేఖర్ మాస్టర్ స్పందిస్తూ.. యా జింగ చికమ్ జింగ చికమ్ అంటూ కామెంట్ చేశాడు. అయితే ఈ జింగ చిక, జింగ చికం అనే వీరి కోడ్ భాషనో ఏంటో గానీ ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.