కోలీవుడ్ టాక్ : ధనుష్ కోసం క్రేజీ సబ్జెక్ట్ రెడీ చేసిన శేఖర్ కమ్ముల

దక్షిణాది సినిమా దగ్గర తమ టాలెంట్ తో అదరగొట్టే యంగ్ హీరోస్ లో వెర్సటైల్ నటుడు ధనుష్ కూడా ఒకడు. కాగా ధనుష్ రీసెంట్ గానే తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి తో చేసిన “సార్” సినిమాతో తన కెరీర్ లోనే పెద్ద హిట్ ని తాను అందుకున్నాడు. కాగా ఈ సినిమా తర్వాత మరో తెలుగు దర్శకుడు అయినటువంటి శేఖర్ కమ్ముల తో ధనుష్ ఇంకో సినిమా చేయనున్న సంగతి అందరికీ తెలిసిందే.

నిజానికి శేఖర్ కమ్ముల సినిమా వెంకీతో సినిమా కంటే ముందే అనౌన్స్ అయినప్పటికీ అది కాస్తా ఆగింది. కానీ ఇప్పుడు ఫైనల్ గా పట్టాలెక్కనుండగా ఈ సినిమా విషయంలో ధనుష్ కోసం ఇంట్రెస్టింగ్ నరేషన్ తో కూడిన అదిరే సబ్జెక్టు ని అయితే సిద్ధం చేసినట్టుగా కోలీవుడ్ వర్గాలు చెపున్నాయి. కాగా ఈ చిత్రం అంతా 1970 లేదా 80ల సమయంలో ఉంటుందని అని తెలుస్తుంది.

అంతే కాకుండా అప్పటి పొలిటికల్ గా జరిగిన ఓ నిజ జీవిత సంఘటన ఆధారంగా అయితే ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా ఈ చిత్రం లో ముఖ్య పాత్ర కోసం నాగార్జున కూడా ఓకే అయ్యారు. తన రోల్ కూడా అంతే కీలక పాత్ర పోషించడంతో తాను అందుకే ఓకే చెప్పారని రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా ఈ సినిమా అయితే షూటింగ్ ఈ నవంబర్ నుంచి స్టార్ట్ చేసే సన్నాహాలు అవుతున్నాయని కోలీవుడ్ వర్గాలు చెప్తున అప్డేట్.