‘సీతా కళ్యాణ వైభోగమే’ 26న విడుదల!

సుమన్‌ తేజ్‌ , గరీమ చౌహన్‌ హీరో హీరోయిన్లుగా డ్రీమ్‌ గేట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సతీష్‌ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్‌ నిర్మిస్తున్న చిత్రం ‘సీతా కళ్యాణ వైభోగమే’. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 26న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్రయూనిట్‌ మీడియా ముందుకు వచ్చింది. హీరో హీరోయిన్లు, దర్శక నిర్మాతలు రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌మెంట్‌ సందర్భంగా మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా హీరో సుమన్‌ తేజ్‌ మాట్లాడుతూ.. కొత్త హీరోని నమ్మి సినిమా తీయడం అంత ఈజీ కాదు. మా మీద నమ్మకంతో చిత్రాన్ని తీసిన నిర్మాత రాచాల యుగంధర్‌కి థాంక్స్‌. గరీమ చౌహాన్‌ చక్కగా నటించారు. మా దర్శకుడు సతీష్‌ గారు అన్ని అంశాలను కలగలపి మంచి కమర్షియల్‌ సినిమాను తీశారు. గగన్‌ విహారి చాలా వైల్డ్‌గా నటించారు. సంగీతం, కెమెరా వర్క్‌ అద్భుతంగా ఉంటుంది. మా ఫ్యాషన్‌ పార్ట్నర్స్‌ అయిన నీరుస్‌కు థాంక్స్‌. మా చిత్రాన్ని ఆడియెన్స్‌ ఆదరించాలని కోరారు.

హీరోయిన్‌ గరీమ చౌహాన్‌ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులు అందజేస్తోన్న ప్రేమకు థాంక్స్‌. నాకు ఇదే మొదటి చిత్రం. ఇక్కడ అందరూ నన్ను ప్రోత్సహిస్తున్నారు. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్‌. మహిళలకు తగిన ప్రాధాన్యం, గౌరవం ఇవ్వాలని చెప్పే సినిమా ఇది. మా మూవీని చూసి అందరూ ఆదరించండని అన్నారు.

నటుడు గగన్‌ విహారి మాట్లాడుతూ.. ధర్మపురితో హీరోగా నాకు మంచి పేరు వచ్చింది. దర్శకుడు సతీష్‌ గారు ‘సీతా కళ్యాణ వైభోగమే’ కథ చెప్పారు. టైటిల్‌ వింటేనే ఎంతో హాయిగా అనిపించింది. రాముడు, సీత అనే కాన్సెప్ట్‌తోనే ఈ చిత్రాన్ని తీశారు. ఇందులో నేను చాలా వైల్డ్‌గా కనిపిస్తాను. మా చిత్రాన్ని ప్రేక్షకులు చూసి సక్సెస్‌ చేయాలని అన్నారు.