నాకు నచ్చిన గెటప్‌లో కనిపిస్తా: ‘ఈగల్‌’ చిత్రంపై హీరో రవితేజ!

‘ఈగల్‌’ సినిమా అద్భుతంగా వచ్చింది. ప్రేక్షకుల స్పందన కోసం ఎదురుచూస్తున్నాను. ఈ సినిమాలో నాకు విపరీతంగా నచ్చిన గెట్‌ప్ లో కనిపిస్తాను’ అని రవితేజ అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన యాక్షన్‌ ఎంటర్ టైనర్ ‘ఈగల్‌’. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకుడు. అనుపమా పరమేశ్వరన్‌, కావ్యాథాపర్‌ హీరోయిన్లు. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మాత. ఫిబ్రవరి 9న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది.

రవితేజ మాట్లాడుతూ ‘ఈగల్‌’లో నా పాత్ర కోసం మేకోవర్‌ అవ్వడానికి మూడు నెలలు పట్టింది. నాకు చాలా బాగా నచ్చింది. అనుపమ పాత్రే ‘ఈగల్‌’ సినిమాను నడిపిస్తుంది. కావ్య లవ్లీ క్యారెక్టర్‌ చేశారు. మా దర్శకుడు కార్తీక్‌కు చాలా స్పష్టత ఉంది. సినిమాను ఎక్స్‌ట్రార్డినరీగా తీశాడు. పీపుల్‌ విూడియా ఫ్యాక్టరీ నాకు హోమ్‌ ప్రొడక్షన్‌ లాంటిది. ఈ బేనర్‌లో ఎన్ని సినిమాలు చేయడానికైనా సిద్ధమే. నవదీప్ కు ఈ సినిమాతో నటుడిగా మంచి పేరు వస్తుంది’ అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ‘ఈగల్‌’ స్టైలిష్‌ మాస్‌ యాక్షన్‌ ఎంటర్ టైనర్. క్లయిమాక్స్ అద్భుతంగా ఉంటుంది. నాకు అవకాశం ఇచ్చిన రవితేజకు ధన్యవాదాలు. ఇందులో నటీనటుల కాంబినేషన్‌ కూడా కొత్తగా ప్రయత్నించాం’ అన్నారు. విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ కార్తిక్‌తో మరో సినిమా చేస్తున్నాం. మంచి సందేశం ఉన్న చిత్రమిది’ అన్నారు.

అనుపమా పరమేశ్వరన్‌ మాట్లాడుతూ ‘పీపుల్‌ విూడియా ఫ్యాక్టరీలో నాకు ఇది రెండో చిత్రం. ‘ఈగల్‌’లో నాకు అద్భుతమైన పాత్ర ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ అవుతుంది. రవితేజతో మరిన్ని సినిమాల్లో నటించాలనుంది’ అని చెప్పారు. సరికొత్త ప్రేమకథా చిత్రంలో భాగమైనందుకు ఆనందంగా ఉందని కావ్యాథాపర్‌ తెలిపారు. రవితేజ అన్నయ్యతో పనిచేయడం ఆనందాన్నిచ్చిందని నవదీప్‌ తెలిపారు.