చిరు సినిమాలో నటించే అవకాశాన్ని కొట్టేసిన ఆ యువ హీరో !

tollywood megastar chiranjeevi tests corona positive

మెగాస్టార్ చిరంజీవి సినిమాలో అవకాశం అంటే ఎవ్వ‌రూ వ‌దులుకోరు. మెగాస్టార్ ఇన్ఫిరేష‌న్‌ తో సినిమా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన వారే కాదు వారి కుటుంబంలోని హీరోలు సైతం ఆయ‌న‌తో ప‌నిచేసేందుకు ఎదురుచూస్తుంటారు. అలాంటి అవ‌కాశ‌మే చిరంజీవి అంటే ఎంతగానో ఇష్ట‌ప‌డే ఓ టాలెంటెడ్ హీరోకు వ‌చ్చింది. అంతే ఆ న‌టుడు ఇప్పుడు సంతోషంలో తేలుతున్నాడ‌ట‌. ఇంత‌కు ఆ హీరో ఎవ‌రంటే.. స‌త్య‌దేవ్.

Image

టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారిన స‌త్య‌దేవ్ మొద‌టి నుంచి చిరంజీవిపై ప్ర‌త్యేక‌మైన అభిమానాన్ని చూపుతూ వ‌స్తున్నారు. గ‌తేడాది చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా స్పెష‌ల్ డ్యాన్స్ వేసి అంద‌రినీ ఆక‌ట్టుకున్నాడు ఈ హీరో.

అంతేకాదు తాజాగా చిరుతో ఓ ఫొటోను షేర్ చేసి.. ఈ ఫొటో షేర్ చేయ‌కుండా 2020కు గుడ్ బై చెప్ప‌లేము అని కామెంట్ పెట్టాడు. ఇక మ‌ల‌యాళంలో మంచి విజ‌యం సాధించిన లూసిఫ‌ర్‌ని తెలుగులో రీమేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. త‌మిళ ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా ఈ రీమేక్‌కి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి.

ఈ రీమేక్‌లో ఓ పాత్ర కోసం మూవీ యూనిట్ స‌త్య‌దేవ్‌ని సెల‌క్ట్ చేసుకుంద‌ట‌. అస‌లే త‌న ఆరాధ్య దైవం సినిమా అనే స‌రికి ఏ మాత్రం ఆలోచించ‌కుండా ఓకే చెప్పేశాడ‌ట‌. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే రానున్న‌ట్లు తెలుస్తోంది. ఎన్వీఆర్ సినిమాస్, కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీని నిర్మిస్తున్నారు.