సర్కారు వారి పాట అప్ డేట్.. మహేశ్ బాబు ఫ్యాన్స్ సంబరాలు చేసుకోవడానికి రెడీ అయిపోండి ఇక

Sarkaru vaari paata movie shooting to start from october

సరిలేరు నీకెవ్వరూ అంటూ వచ్చి టాలీవుడ్ రికార్డులను మహేశ్ బాబు బద్దలు కొట్టారు. వరుస హిట్లతో ప్రస్తుతం మహేశ్ బాబు జోరుమీదున్నాడు. సరిలేరు నీకెవ్వరూ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చిన మహేశ్ బాబు.. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు.

Sarkaru vaari paata movie shooting to start from october
Sarkaru vaari paata movie shooting to start from october

నిజానికి సర్కారు వారి పాట సినిమా షూటింగ్ ఎప్పుడో అయిపోవాల్సింది కానీ.. కరోనా కారణంగా సినిమా షూటింగే ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. దీంతో మహేశ్ ఫ్యాన్స్ కొంచెం బాధపడ్డారు. మా హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది.. అంటూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

అయితే.. మహేశ్ బాబు ఫ్యాన్స్ ఇక సంబరాలు చేసుకునే సమయం వచ్చేసింది. సర్కారు వారి పాట సినిమా షూటింగ్ వచ్చే నెల అక్టోబర్ లో ప్రారంభం కానుంది. ఈ సినిమా కూడా సోషల్ మెసేజ్ తో కూడుకున్నదే. పరుశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది.

ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్ ఏంటంటే.. మహేశ్ ఈ సినిమాలో డ్యుయల్ రోల్ లో నటిస్తున్నాడు. రెండు రోల్స్ కూడా పవర్ ఫుల్ పాత్రలే. అందుకే.. మహేశ్ ఫ్యాన్స్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఈసారి మహేశ్ సినిమా బాక్సాఫీసు వద్ద రికార్డులను బ్రేక్ చేయాల్సిందే అని అంటున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. వచ్చే నెలలో తొలి షెడ్యూల్ ప్రారంభం కానుంది. ప్రభుత్వం నుంచి షూటింగ్ కోసం అనుమతులు కూడా తీసుకున్నారు.

ఈసినిమాలో సరికొత్త మహేశ్ బాబు ప్రేక్షకులను అలరించనున్నారు. మహేశ్ బాబు ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో కనిపించిన పాత్ర వేరు.. ఇప్పుడు ఈ సినిమాలో చాలా కొత్తగా ఉంటుందట. ఇప్పటికే రిలీజ్ అయిన మోషన్ పోస్టర్ చూస్తే అదే తెలుస్తుంది. ఉంగరాల జుట్టుతో సరికొత్త గెటప్ లో మహేశ్ కనిపించాడు.

ఇక.. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్ నిర్మిస్తుండగా..థమన్ మ్యూజిక్ డైరెక్టర్.

Sarkaru Vaari Paata Motion Poster | Mahesh Babu | Parasuram Petla | Thaman S