చిరు – సందీప్ వంగ – ఈ క్రేజీ జానర్ లో చిత్రం..!

Sandeep Vanga writing story for Chiranjeevi

చేసినవి రెండే సినిమాలు అయినప్పటికీ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర గట్టిగా వినిపిస్తున్న పేరు సందీప్ రెడ్డి వంగ. తాను క్రియేట్ చేసిన ఆనిమల్ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతూ ఉండగా ఈ సినిమా సక్సెస్ లో అయితే మేకర్స్ బిజీగా ఉన్నారు.

దీనితో సందీప్ పేరు గట్టిగా వినిపిస్తుండగా ఈ దర్శకుడు టాలీవుడ్ దిగ్గజ మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి అభిమాని అనేది అందరికీ తెలిసిందే. అయితే ఎప్పటి నుంచో వీరి నుంచి ఓ సినిమా చాలా మంది ఎదురు చూస్తున్నారు. మెయిన్ గా తమిళ స్టార్ హీరోస్ రజిని కమల్ లాంటి వారు తమ యంగ్ ఫ్యాన్ దర్శకులకి ఛాన్స్ ఇస్తే ఒక గుర్తుండిపోయే సినిమాలు చేస్తున్నారు.

అలాంటి ఒక సినిమా సందీప్ తో పడాలి అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఈ సెన్సేషనల్ కాంబినేషన్ పై ఓ క్రేజీ న్యూస్ సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. ప్రస్తుతం సందీప్ అండ్ ఆనిమల్ టీం యూఎస్ డల్లాస్ లో ఉండగా అక్కడ ఓ మీట్ లో అయితే మెగాస్టార్ తో సినిమాపై తాను కామెంట్స్ చేసాడు.

తాను చిరంజీవి గారితో సినిమా చేస్తే ఒక ఏక్షన్ డ్రామా చేస్తానని తాను చెప్పుకొచ్చాడు. అంతే జస్ట్ ఈ ఒక్క స్టేట్మెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. జస్ట్ ఎలాంటి జానర్ చేస్తాడో చెప్తేనే ఈ రేంజ్ లో రెస్పాన్స్ ఉంది. మరి నిజంగా కాంబినేషన్ సెట్ అయ్యి సినిమా మొదలైతే ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి అయితే ఇద్దరికీ కూడా వేరే వేరే భారీ కమిట్మెంట్స్ ఉన్నాయి.