ఇక బాలీవుడ్డే టార్గెట్!

అర్జున్‌ రెడ్డి సినిమాతో టాలీవుడ్‌ లోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చాడు డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగ. రామ్‌ గోపాల్‌ వర్మ తర్వాత ఆ స్థాయి ఇంపాక్ట్‌ మొదటి సినిమాకే ఇచ్చిన వన్‌ అండ్‌ ఓన్లీ డైరెక్టర్‌ గా సందీప్‌ రెడ్డి వంగ పేరు తెచ్చుకున్నాడు. ఇదే మూవీని హిందీలో కబీర్‌ సింగ్‌ గా తీసి అక్కడ కూడా హిట్‌ కొట్టాడు సందీప్‌.

కబీర్‌ సింగ్‌ ని చూసిన కొంతమంది ఇంటలెక్చువల్స్‌ సినిమా చాలా వయొలెంట్‌ గా ఉందంటూ కామెంట్స్‌ చేసారు. సోషల్‌ మీడియాలో వేదికగా కూడా కొంతమంది సెలబ్రిటీస్‌ కబీర్‌ సింగ్‌ సినిమా వయొలెంట్‌ గా ఉందంటూ కామెంట్స్‌ చేసారు. ఈ కామెంట్స్‌ సందీప్‌ రెడ్డి వంగ వరకూ వెళ్లడంతో ‘కబీర్‌ సింగ్‌ సినిమాని వయొలెంట్‌ ఫిల్మ్‌ అంటున్నారు కదా అసలు వయొలెన్స్‌ అంటే ఎలా ఉంటుందో నా నెక్స్ట్‌ సినిమాలో చూపిస్తానని’ స్ట్రెయిట్‌ గా చెప్పేసాడు.

ఈ కామెంట్స్‌ విన్న వాళ్లు సందీప్‌ ఎదో క్యాజువల్‌ చెప్పాడు అనుకున్నారు కానీ అనిమల్‌ సినిమా ప్రమోషనల్‌ కంటెంట్‌ చూసిన తర్వాత మాత్రం సందీప్‌ ఊరికే చెప్పలేదు, బాలీవుడ్‌ కి బొమ్మ చూపించబోతున్నాడు అనే విషయం అర్ధమవుతుంది. అనిమల్‌ గ్లిమ్ప్స్‌ తోనే ఈ విషయం క్లియర్‌ గా అర్ధం అయ్యేలా చేసిన సందీప్‌ రెడ్డి వంగ, లేటెస్ట్‌ గా క్యారెక్టర్స్‌ ని ఇంట్రడ్యూస్‌ చేస్తూ పోస్టర్స్‌ వదులుతూ ఉన్నాడు.

ఇప్పటికే అనిల్‌ కపూర్‌, రష్మికల పోస్టర్స్‌ వదిలిన సందీప్‌, లేటెస్ట్‌ గా అనిమల్‌ విలన్‌ బాబీ డియోల్‌ పోస్టర్‌ ని రివీల్‌ చేసాడు. అనిమల్‌ కి విలన్‌ అంటే అనిమల్‌ కన్నా భయంకరంగా ఉండాలి అనుకున్నారో లేక బాబీ డియోల్‌ క్యారెక్టర్‌ నుంచే అనిమల్‌ టైటిల్‌ వచ్చిందో ఏమో కానీ అనిమల్‌ పోస్టర్‌ లో బాబీ డియోల్‌ బ్లడ్‌ షెడ్‌ లో మోస్ట్‌ వయొలెంట్‌ మెన్‌ గా కనిపిస్తున్నాడు. పోస్టర్స్‌ కే ఇలా ఉంటే నవంబర్‌ 28న రిలీజ్‌ కానున్న అనిమల్‌ టీజర్‌ తో సందీప్‌ రెడ్డి వంగ ఇంకెలాంటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తాడో చూడాలి.