ఔను.! నిజమే.! సందీప్ రెడ్డి ‘వంగా’డు.!

సందీప్ రెడ్డి వంగా.. ఒకింత డిఫరెంట్ క్యారెక్టర్.! మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని.! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే వల్లమాలిన అభిమానం.! అభిమానమే అయినా, అది కొంతవరకే పరిమితం.!

సినిమా విషయనికి వచ్చేసరికి, భిన్నమైన టేస్ట్ వున్నోడు.! ‘అర్జున్ రెడ్డి’ సినిమా చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. ‘యానిమల్’ సినిమా చూశాక, ఇంకాస్త భిన్నం.. అనిపించాడు చాలామందికి.

సందీప్ రెడ్డి వంగా.. అస్సలు వంగడు.. అనే చర్చ అంతటా జరిగింది. ఆ బోల్డ్ కంటెంట్.. ఆ బూతులు.. బాబోయ్, ‘యానిమల్’ అనిపించేశాడు. అయినా, అందులో అతని టాలెంట్ వుందంటారు కొందరు.

సరే, ఆ సంగతి పక్కన పెడితే, ప్రభాస్‌తో ‘స్పిరిట్’ చేయాలనుకున్నాడు సందీప్ రెడ్డి వంగా. ‘యానిమల్’ తర్వాత చేయాల్సిన సినిమా అదే. మధ్యలోకి అల్లు అర్జున్ కాంబినేషన్ కూడా వచ్చింది.

అయితే, ఇప్పుడు సందీప్ రెడ్డి ‘వంగాడు’ అట.! అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ‘యానిమల్ పార్క్’ వైపే సందీప్ రెడ్డి వంగా మొగ్గు చూపాడట. అతి త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్ళిపోనుందట సినిమా. మాళవిక మోహనన్ హీరోయిన్.! ఈసారి కాస్త వేగంగా సినిమా పూర్తి చేస్తాడట.