Rajendra Prasad: వాడెవడో చందనం దొంగ.. వాడు కూడా హీరోనేనా.. రాజేంద్రప్రసాద్ సంచలన వ్యాఖ్యలు!

Rajendra Prasad: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుని దూసుకుపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు ఎంతో అద్భుతమైన ఆదరణ లభిస్తుంది. ఇక కలెక్షన్ల పరంగా అల్లు అర్జున్ సినిమా సునామీ సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అల్లు అర్జున్ సినిమా గురించి నటుడు రాజేంద్రప్రసాద్ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

రాజేంద్రప్రసాద్ తాజాగా హరికథ అనే ఒక కొత్త వెబ్ సిరీస్ లో నటించారు ఈ వెబ్ సిరీస్ త్వరలోనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది ఈ నెల 13 నుంచి ఈ వెబ్ సిరీస్ ప్రసారం కాబోతున్న నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్ లో ఈ వెబ్ సిరీస్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రాజేంద్రప్రసాద్ పరోక్షంగా పుష్ప సినిమా గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

త్రేతా యుగం, ద్వాపర యుగం, ఇప్పుడు కలియుగంలో ఇవాళ వస్తున్న కథలు మీరు చూస్తునే వున్నారు కళ్ళముందు. నిన్న గాక మొన్న చూసాం. వాడెవడో చందనం దుంగలు దొంగ, వాడు హీరో. సరే హీరోలలో మీనింగ్స్ మారిపోయాయి. నా అదృష్టం నా 48 సంవత్సరాల సినీ కెరియర్ లో నాకంటూ ఎంతో ప్రత్యేకమైన హీరోగా గుర్తింపు పొందాను అంటూ ఈయన వెల్లడించారు.

ఎంతోమంది హీరోలతో కలిసి నటిస్తూ వస్తున్నాను. ఈ తరం హీరోలతో కూడా నటిస్తున్నానని ఆయన అన్నారు. అయితే ఆయన పేరు ప్రస్తావించక పోయినా ఎర్రచందనం అనగానే పుష్ప, పుష్ప2 సినిమాలే గుర్తు వస్తాయి. ఆయన హీరో క్యారెక్టర్ గురించి అన్నా సరే ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులు మాత్రం ఈయనపై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు అయితే ఒక నటుడు అయిండుకొని సినిమాలను సినిమాలాగే చూడాలి అని సందేశం ఇవ్వాల్సింది పోయి ఈ విధంగా మాట్లాడటం సరైనది కాదు అంటూ అల్లు అర్జున్ అభిమానులు ఈయనపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.