నిషాదగా సంయుక్త మీనన్‌!

ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే టాలెంట్‌తో పాటు అదృష్టం కూడా ఉండాలని పలువురు చెబుతుంటారు. అదృష్టం లేకపోతే అవకాశాలు సైతం గుమ్మం దగ్గరికి వచ్చి వెనక్కి వెళ్లిపోతాయట. అలా అదృష్టాన్ని అరచేతిలో పట్టుకొచ్చుకున్న బ్యూటీ సంయుక్త విూనన్‌.

గతేడాది రిలీజైన భీమ్లానాయక్‌ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పట్టిందల్లా బంగరమే అన్నట్లు ఆమె తెలుగులో చేసిన నాలుగు సినిమాలు బంపర్‌ హిట్లే. దాంతో ఈ అమ్మడుని టాలీవుడ్‌ గోల్డెన్‌ లెగ్‌ అంటూ వర్ణిస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో మూడు సినిమాలున్నాయి.

అందులో డెవిల్‌ ఒకటి. కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు నవీన్‌ మేడారం దర్శకుడు. తాజాగా ఈ సినిమా నుంచి సంయుక్త మీనన్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. చేతిలో కొబ్బరి కాయ, పూలమాలతో ఉన్న బుట్టను పట్టుకుని దేవుడికి పూజా చేయడానికి వెళ్తున్నట్లు ఉన్న పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు.

పోస్టర్‌లో సంయుక్తం తెలుగు తనం ఉట్టి పడేలా.. చాలా అందంగా కనిపిస్తుంది. చుట్టు గోపురాలు, గంట, తెల్లటి పావురాలు.. ఇలా పోస్టర్‌ మంచి పాజిటీవ్‌ వైబ్‌ను క్రియేట్‌ చేస్తుంది. ఈ సినిమాలో సంయుక్త నిషాదగా కనిపించనుంది. పీరియాడిక్‌ బ్యాక్‌గ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణ్‌ రామ్‌ బ్రిటీషర్‌లకు సీక్రెట్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు.

ఇప్పటికే రిలీజైన టీజర్‌ జనాల్లో మంచి క్యూరియాసిటీ క్రియేట్‌ చేసింది. దేశ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా డెవిల్‌ ముసుగేసుకుని బ్రిటీషర్ల కోసం కళ్యాణ్‌రామ్‌ ఎందుకు పని చేశాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తుంది.

లుక్స్‌ పరంగా కళ్యాణ్‌ రామ్‌ కూడా ఈ సినిమాలో చాలా బాగున్నాడు. అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.