ఇప్పుడు టాలీవుడ్ సినిమా దగ్గర రాబోతున్న నెక్స్ట్ బిగ్ మూవీ ఏదన్నా ఉంది అంటే అది డెఫినెట్ గా పవర్ స్టార్ కళ్యాణ్ అలాగే సాయి ధరమ్ తేజ్ లు నటిస్తున్న “బ్రో” అనే చెప్పాలి. కాగా ఈ చిత్రాన్ని ప్రముఖ తమిళ నటుడు వెర్సటైల్ సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు.
అయితే తమిళ్ లో మంచి హిట్ అయ్యిన ఈ చిత్రాన్ని తెలుగులో కూడా తానే దర్శకత్వం వహిస్తూ టాలీవుడ్ లోకి ఎంటర్ అవుతున్నారు. అయితే ఈ చిత్రంపై ఇప్పుడు మంచి హైప్ నెలకొనగా ఇప్పుడు చిత్ర యూనిట్ సహా దర్శకుడు సముద్రఖని కూడా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు.
అయితే సముద్రఖని లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వూలో చేసిన షాకింగ్ స్టేట్మెంట్స్ ఇపుడు వైరల్ గా మారింది. తాను ఇప్పుడు బ్రో చిత్రం తెలుగు తర్వాత హిందీలో చేస్తానని అలాగే ఆ తర్వాత కన్నడ, ఆ తర్వాత మలయాళ ఇంకా భోజ్ పూరి మరిన్ని భాషల్లో సెపరేట్ సెపటర్ గా అక్కడి తారాగణంతో చేయబోతున్నామని తెలిపారు.
దీనితో ఈ వింతైన స్టేట్మెంట్ విని అయితే పవన్ ఫ్యాన్స్ సహా మూవీ లవర్స్ కూడా ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే ఈ సినిమా ఇన్ని భాషల్లో చేస్తున్నారా లేక బిల్డప్ కోసం చేసిన స్టేట్మెంట్ అనేది చాలా మందికి అయితే అర్ధం కాలేదు. ఇక ఈ చిత్రంలో అయితే కేతిక శర్మ, ప్రియా వారియర్ లు హీరోయిన్స్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ఈ జూలై 28న సినిమా రిలీజ్ కాబోతుంది.