ఈ ఏడాది టాలీవుడ్ లో పెళ్లి బాజా మోగుతూనే ఉంది. ఒకరి తర్వాత ఒకరం అన్నట్టు వరుసగా పెళ్ళి పీటలు ఎక్కుతున్నారు. హీరో, హీరోయిన్స్ ,దర్శకులు, రచయితలు, సింగర్స్ ఇలా చాలా మంది ఈ ఏడాది ఒకింటి వారయ్యారు. అక్టోబర్ 30న కాజల్ అగర్వాల్ కుటుంబ సభ్యుల మధ్య గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకుంది. ఇక డిసెంబర్ 9న నిహారిక- చైతన్య ల వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో జరగనుంది.
టాలీవుడ్ లో ‘పంచాక్షరి’, ’బావ’, అహ నా పెళ్లంట వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు సామ్రాట్. బిగ్ బాస్ సీజన్2లోను అలరించిన సామ్రాట్ గతంలో హర్షిత రెడ్డిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి విభేదాలు రావడంతో ఇటీవల విడాకులు తీసుకున్నారు. దీంతో ఆయనకు రెండో వివాహం జరిపించారు కుటుంబ సభ్యులు. కాకినాడలో జరిగిన వివాహ వేడుకలో శ్రీలిఖితను వివాహం చేసుకున్నాడు.
సామ్రాట్- శ్రీ లిఖిత వివాహానికి బిగ్ బాస్ ఫేం తనీష్, దీప్తి సునయనతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కరోనా వలన కేవలం కొద్ది మంది కుటుంబసభ్యుల మధ్యే ఈ వివాహం జరిగినట్టు తెలుస్తుంది. ఇక కొద్ది రోజులుగా సామ్రాట్ సోదరి, మోడల్ శిల్పారెడ్డి తన సోదరుడి పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలోషేర్ చేస్తూ వస్తుంది. సామ్రాట్ రెడ్డి పెళ్లి కొడుకును చేసిన సందర్భంగా తీసిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ నూతన దంపతులకు అభిమానులు, నెటిజన్స్, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు