ప్రస్తుతం తెలుగు , తమిళం, హిందీ భాషలలో బిగ్ బాస్ సందడి నెలకొంది. తెలుగులో నాగార్జున హోస్ట్‌గా ఈ షో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళుతుంది. శని, ఆదివారాలలో తళుక్కున మెరిసే నాగ్ స్టైలిష్ లుక్‌లో దర్శనమిస్తూ అందరిని సర్‌ప్రైజ్ చేస్తున్నారు. సీజన్ 1, సీజన్ 2లలో ఎన్టీఆర్, నానిలు సూట్‌లలో దర్శనమిస్తే నాగ్ మాత్రం వింటేజ్ లుక్‌లో మెరుస్తున్నారు. దీనంతటికి కారణం డిజైనర్ మనోజ్ఞ ఆవునూరి. ఎప్పటికప్పుడు స్టైలిష్ డ్రెస్ డిజైన్ చేస్తూ ప్రేక్షకులకి సరికొత్త థ్రిల్‌ని అందిస్తుంది.
వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం ఇటీవల మనాలి వెళ్ళిన నాగార్జున ఓ వారం బిగ్ బాస్ షోకి అందుబాటులో లేకుండా పోయారు. దీంతో ఆ బాధ్యతలను ఆయన కోడలు సమంతకు అప్పగించారు. అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తక్కువ కాకుండా షోని సక్సెస్‌ఫుల్ గా నడిపించింది. సందర్భానికి తగ్గట్టు పంచ్‌లు విసురుతూనే మధ్య మధ్యలో జోక్స్ చేస్తూ ఫుల్ ఎంటర్‌టైన్ చేసింది. అయితే ఆ రోజు సమంత లుక్ అందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా చీరకట్టులో మెరిసిన సమంత మెడలో కాస్ట్‌లీ జ్యువలరీ ధరించి సరికొత్త లుక్‌లో కనిపించింది.
ఫ్యాషన్ డిజైనర్ మనోజ్ఞ పర్యవేక్షణలో అందంగా తయారైన సమంత ఆ రోజు రూ.44,800 విలువైన బనారస్ చీరను ధరించింది. మెడలో జ్యువలరీతో పాటు ఇయర్ రింగ్స్, త్రిశూల్ బ్యాంగిల్స్ ధర రూ. 35 లక్షలు అని మనోజ్ఞ చెప్పుకొచ్చింది. ఎంతో కాస్ట్‌లీ హోస్ట్ గా బిగ్ బాస్ వేదికపై అడుగుపెట్టిన సమంత అంతే రేంజ్‌లో వినోదం అందించింది. కాగా, సమంత ప్రస్తుతం సామ్ జామ్ అనే వెబ్ సిరీస్ తో బిజీగా ఉంది. నవంబర్ 13 నుండి ఇది ఆహాలో ప్రసారం కానుంది.