Home Entertainment సామ్ జామ్ మెగాస్టార్ ప్రోమో వచ్చేసింది !

సామ్ జామ్ మెగాస్టార్ ప్రోమో వచ్చేసింది !

కరోనా కాలంలో ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ గా నిలిచింది ఓటిటి. లాక్ డౌన్ మొదలైన తర్వాత ఎన్నో ఓటిటిలు పుట్టుకొచ్చాయి. అందులో ఆహా కూడా ఒకటి. ప్రముఖ ఓటీటీ ఆహా కోసం కథానాయిక సమంత నిర్వహిస్తున్న సెలబ్రిటీ టాక్ షో సామ్ జామ్.

Sam Jam Mega Promo- Samantha Akkineni, Megastar Chiranjeevi

ఈ కార్యక్రమం కోసం పలువురు సెలబ్రిటీలను సమంత ఇంటర్వ్యూ చేస్తోంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా, తమన్నా తదితరులతో సందడి చేసిన సమంత తాజాగా మెగాస్టార్ చిరంజీవిని కూడా ఇంటర్వ్యూ చేసింది.

ఆ కార్యక్రమానికి సంబంధించిన చిన్న చిన్న వీడియోలను ఆహా టీమ్ ఇప్పటికే విడుదల చేసింది. తాజాగా పూర్తి ప్రోమో బయటకు వచ్చింది. సమంతతో కలిసి చిరంజీవి చేసిన సందడిని ప్రోమోలో చూపించారు. సమంత అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు చిరు సమాధానాలిచ్చారు. కళ్లకు గంతలు కట్టుకుని దోశను తిరగేశారు. క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 25 నుంచి ఈ కార్యక్రమం స్ట్రీమింగ్‌కు రాబోతోంది.

- Advertisement -

Related Posts

ఈ నెల సినిమాలకు కష్టాలు తప్పవన్నమాట

కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటుతోంది. కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధిస్తున్నాయి. ఇంకొన్ని రాష్ట్రాలు సినిమా హాళ్లను మూసివేస్తున్నాయి. మిగతా రాష్ట్రాల్లో మాదిరిగానే తెలుగు...

పవర్ స్టార్ స్టామినా.. ‘వకీల్ సాబ్’ వసూళ్ల వరద

ఎన్నో అంచనాల నడుమ విడుదలైన పవన్ కళ్యాణ్ చిత్రం 'వకీల్ సాబ్' మొదటిరోజును పూర్తి చేసుకుంది. ప్రభుత్వం ఆంక్షలు, కోవిడ్ భయాందోళనల నడుమ థియేటర్లలోకి అడుగుపెట్టిన 'వకీల్ సాబ్' దాదాపు నార్మల్ రోజుల్లో...

వకీల్ కోసం చిరు ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చుగా

ఏపీ ప్రభుత్వానికి, 'వకీల్ సాబ్' డిస్ట్రిబ్యూటర్లకు నడుమ టికెట్ ధరల విషయమై రగడ నడుస్తున్న సంగతి తెలిసిందే. మొదటి మూడు రోజులు టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటు లేకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించింది....

Latest News