Samantha : చైతూ, అఖిల్ తో పోటీపడనున్న సామ్…ఏజెంట్ తో బాక్సఆఫీస్ వద్ద పోటీ….!

Samantha: సమంత దక్షిణాది చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ ఇపుడు. మొన్నటి వరకు హీరో పక్కన గ్లామర్ పాత్రలు చేస్తూ కుర్రకారు లో క్రేజ్ సంపాదించిన సామ్ వివాహం తర్వాత తనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలను చేస్తూ తన స్థాయిని ఇంకొంచం పెంచుకుంటూ వస్తోంది.విడాకుల తర్వాత సమంత హీరోయిన్ గా అనౌన్స్ చేసిన మొదటి సినిమా ‘యశోద’.యశోద పాన్ ఇండియా సినిమా గా ప్రేక్షకుల ముందుకీ రాబోతోంది.

ఈ సినిమాని శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతోన్న ‘యశోద’ సినిమా విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 2022 ఆగస్టు 12న తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం అనౌన్స్ మెంట్ పోస్టర్ ను కూడా వదిలారు. యశోద సినిమాలో సమంత ప్రెగ్నెంట్ ఉమెన్ క్యారెక్టర్ లో చేయబోతోందని సమాచారం. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమాని తీస్తున్నారు.

అయితే అదే వారం బాక్సాఫీస్ వద్ద అక్కినేని ఇద్దరి హీరోల సినిమాలు సందడి చేయబోతున్నాయి.చైతూ హిందీ డెబ్యూ మూవీ ‘లాల్ సింగ్ చద్దా’ ను పలు వాయిదాల అనంతరం 2022 ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఆ మరుసటి రోజు అంటే ఆగస్ట్ 12న అఖిల్ అక్కినేని హీరోగా చేస్తోన్న యాక్షన్ మూవీ ఏజెంట్ విడుదలవుతుంది.అన్నంతమ్ముల సినిమాలు ఒకటితో ఒకటి పోటీ పడుతున్నాయ్ అనుకుంటే ఇపుడు సమంత కూడా ఆ వరసలో చేరింది.అక్కినేని హీరోలకు బాక్సాఫీస్ దగ్గర సవాలు విసురుతుంది అంటూ సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. దీంతో ఇద్దరు అక్కినేని హీరోల సినిమాలతో సమంత ఢీకొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇందులో విశేషం ఏంటంటే మూడు సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలు కావడం.